Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోని ఉద్యోగ నిపుణులు సగం మంది పైగా ఒత్తిడిలోనే ఉన్నారని లింక్డిన్ సర్వేలో తేలింది. వాల్డ్ మెంటల్ హెల్త్ డే 2021 సందర్బంగా ఈ సంస్థ ఓ ప్రత్యేక సర్వే చేపట్టింది. జులై 31 నుంచి సెప్టెంబర్ 24 మధ్య చేపట్టిన ఈ అధ్యయనంలో 3,881 మంది నిపుణుల అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 55 శాతం ఉద్యోగులు తాము పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గడిచిన ఏడాదిన్నరలో కరోనా అనేక ఇబ్బందులను తెచ్చిపెట్టిందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత అవసరాలు, ఆఫీసు పనిని సమతూల్యం చేయలేకపోతున్నామని 34 శాతం మంది పేర్కొన్నారు. నగదు సరిపోవడం లేదని 32 శాతం మంది, కేరీర్ చాలా ఒత్తిడిగా ఉందని 25 శాతం మంది పేర్కొన్నారు.