Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ తన తొలి న్యూజిలాండ్-ఇండియా సస్టైనబిలిటీ కాంక్లేవ్-2021ను 2021 అక్టోబర్ 5,6 తేదీల్లో నిర్వహించింది. రెండు రోజులు వర్చ్యువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో ప్రపంచం క్రియాశీలకంగా ఉండాలన్న పిలుపుతో పాటు, సుస్థిరత అజెండాపై దృష్టి సారించిన ఇన్సైట్ఫుల్ సమావేశాల్లో అంతర్జాతీయ విద్య, దాని ఔచిత్యం గురించి విస్తృతంగా చర్చించారు. న్యూజిలాండ్-ఇండియా సస్టెయినబిలిటీ సదస్సులో భాగంగా, న్యూజిలాండ్, భారతీయ ఉన్నత విద్యా రంగానికి చెందిన వైస్-ఛాన్సలర్లు, ఆయా పరిశ్రమలకు చెందిన దిగ్గజాలు అంతర్జాతీయ విద్యా రంగానికి సంబంధించి సుస్థితర అభివృద్ధి లక్ష్యాల (SDGs’)గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
భారతదేశంలోని న్యూజిలాండ్ హై కమిషనర్ డేవిడ్ పైన్మాట్లాడుతూ ‘‘న్యూజిలాండ్, భారతదేశం దీర్ఘకాలం నుంచి, చాలా సానుకూల సంబంధాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలుసుపరిపాలన, పారదర్శకత మరియు చట్ట నియమాలను గౌరవిస్తూ, స్థిరమైన జీవితాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మా విధానాల రూపకల్పనలో సుస్థిరత ఒక చోదక శక్తిగా ఉంది అలాగే, దేశం, ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం మనం ఆలోచించి, ప్రణాళిక విధానాన్ని తెలియజేస్తుంది’’ అని తెలిపారు.
‘‘భావోద్వేగ స్థాయిలో, ‘సుస్థిరత’అనేది న్యూజిలాండ్, భారతదేశం వాస్తవంగా పంచుకునే విలువ అని నేను కీలకంగా చెప్పదలుచుకున్నాను. మేము ఇరువురం దానికి ప్రాధాన్యత ఇస్తాము. భౌతిక సౌకర్యం ఒక్కటే అంటే మనం పెంపొందించే అలాగే, పరిరక్షించే పర్యావరణ వ్యవస్థలో కూర్చొని ఉన్నామని మనం భావించకపోయినా, మనం గర్వించదగిన, భవిష్యత్తు తరాల కోసం విలువైనదిగా భావించగలమని మేమిద్దరం గుర్తించాము’’ అని పైన్ వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యూజిలాండ్‌లోని భారత హై కమిషనర్ ముక్తేష్ పరదేశి మాట్లాడుతూ, “యూనివర్సల్ గోల్స్ మరియు లక్ష్యాలను అందించాలనే ఆశయాలు భారత్, న్యూజిలాండ్ మధ్య అనుబంధాన్ని మరింతగా సృష్టిస్తుంది. యుఎన్ సస్టెయినబిలిటీ డెవలప్మెంట్ లక్ష్యాలతో భారతదేశం పూర్తిగా మమేకం అయి ఉండడంతో, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యక్తుల మధ్య సంబంధాల విషయంలో న్యూజిలాండ్‌తో తన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఇది మెరుగైన అవకాశాలను అందిస్తుంది. కలిసి పనిచేయడం ద్వారా, ఈ సమ్మేళనం ఉన్నత విద్యలో ప్రాథమిక భాగంగా సుస్థిరతతో, ఉభయ దేశాలకు అవసరమైన సవాళ్లను సమిష్టిగా ఎదుర్కునేందుకు, అభ్యాస నమూనాలకు కొత్త ఉత్సాహాన్ని అందించేందుకు ఒక మార్గాన్ని తెరుస్తుంది’’ అని వివరించారు.
ఎడ్యుకేషన్ కరిక్యులమ్‌లో ముందుకు తోడ్కొని వెళ్లే సుస్థిరత, ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ ఇటీవల ఫ్యూచర్ లెర్న్ పేరిట ప్రారంభించిన ఆన్లైన్ ప్లాట్ఫారమ్పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా అనేక సుస్థిరత-ఆధారిత కార్యక్రమాలు, మాడ్యూల్లను ప్రారంభించింది. పాఠ్యాంశాలకు అనుగుణంగా, కాన్క్లేవ్ ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ సస్టెయినబిలిటీ గైడ్‌ను ప్రారంభించడం ద్వారా ఇది విద్యార్థులు, విద్యావేత్తలను అటోరోవా న్యూజిలాండ్‌కు స్వాగతించడం ద్వారా హజ ప్రపంచాన్ని చూసుకునే దాని ప్రత్యేకమైన మావోరీ వీక్షణను ప్రదర్శిస్తుంది. భారతదేశంలోని వాస్తవ విద్యార్థి కథలతో పాటు స్థిరమైన అభివృద్ధిని నడపడంలో ఎడ్యుకేషన్ న్యూజిలాండ్ పాత్రను హైలైట్ చేస్తుంది.
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) నుంచి నిపుణులు యుఎన్‌కు చెందిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (SDG) అనుగుణంగా యూనివర్సిటీలను అంచనా వేసే ఏకైక గ్లోబల్ పెర్ఫార్మెన్స్ టేబుల్ THE ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ గురించి చర్చించేందుకు వేదికను వినియోగించుకున్నారు. ఇంప్యాక్ట్ ర్యాంకింగ్ గణాంకాల్లో భాగంగా అంచనా వేసిన నాలుగు కీలక సూచికలపై నిపుణులు వివరించి, విశదీకరించారు- - సంస్థాగత హాజరైన వారు ఇన్సైట్లు పొందేందుకు మరియు భవిష్యత్తు ర్యాంకింగ్‌లో మెరుగైన పనితీరును సాధించేందుకు వారికి సహాయపడటానికి పరిశోధన, నిర్వహణ, ప్రచారం, బోధన అందిస్తుంది.
ఈ సదస్సులో ప్రముఖ న్యూజిలాండ్ మరియు భారతీయ విశ్వ విద్యాలయాలు ఆక్లాండ్ విశ్వవిద్యాలయం, మస్సీ యూనివర్సిటీ, ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (AUT), లింకన్ యూనివర్సిటీ, ఒటాగో విశ్వవిద్యాలయం, TERI స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్, శివ్ నాడార్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ తదితరాలు పాల్గొనగా, ఇతర వర్సిటీల ప్రతినిధులతో వారు తమ అభిప్రాయాలను, నైపుణ్యాలను పంచుకుని, తమ విద్యా సంబంధిత ఫ్రేమ్ వర్క్‌లలో స్థిరమైన పాత్ర పోషించారు.