Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తమ ‘మేరా పెహలా’ స్మార్ట్‌ఫోన్ కార్యక్రమంలో భాగంగా, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ (ఎయిర్టెల్) నేడు మరో వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమంతో వినియోగదారులు నాణ్యమైన స్మార్ట్ఫోన్లకు మారడంతో పాటుగా ఎయిర్టెల్ యొక్క హై స్పీడ్ నెట్‌వర్క్‌పై ప్రపంచశ్రేణి డిజిటల్ అనుభవాలను ఆస్వాదించగలరు.
ఈ ఆఫర్లో భాగంగా 12వేల రూపాయల వరకూ ధర (సుమారు) కలిగిన నూతన స్మార్ట్‌ఫోన్‌ను సుప్రసిద్ధ బ్రాండ్ల నుంచి కొనుగోలు చేసిన ఎడల అత్యంత ఆకర్షణీయమైన రీతిలో 6000 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను ఎయిర్టెల్ అందిస్తుంది. ఈ ప్రయోజనం పొందేందుకు 150కు పైగా స్మార్ట్ఫోన్లు అర్హత కలిగి ఉన్నాయి. ఈ కార్యక్రమం గురించిన మరిన్ని వివరాలు, అర్హత కలిగిన హ్యాండ్సెట్ల వివరాలను తెలుసుకునేందుకు చూడవచ్చు. ఆఫర్లో భాగంగా 6000 రూపాయల క్యాష్‌బ్యాక్ ప్రయోజనం పొందేందుకు, వినియోగదారులు 249 రూపాయలు లేదా అంతకు మించిన ప్రీ పెయిడ్ ప్యాక్‌లతో స్థిరంగా (ప్యాక్ వ్యాలిడిటీకి అనుగుణంగా ) 36 నెలల పాటు రీచార్జ్ చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు క్యాష్‌బ్యాక్‌ను రెండు భాగాలుగా పొందగలరు – మొదటి వాయిదా 2000 రూపాయలను 18 నెలల తరువాత మరియు మిగిలిన 4000 రూపాయలను 36 నెలల తరువాత పొందగలరు. ఉదాహరణకు ఓ వినియోగదారుడు 6000 రూపాయల ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేశారనుకుందాం. ఆమె తగినంతగా డాటా కోటాతో పాటుగా అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను ప్రతి ఎయిర్టెల్ ప్రీ పెయిడ్ రీచార్జ్‌తో పొందడంతో పాటుగా అత్యున్నత స్మార్ట్‌ఫోన్ అనుభవాలను సైతం పొందగలరు. 36 నెలలు ముగిసిన తరువాత, అత్యంత ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్ ప్రయోజనం 6000 రూపాయలను సైతం పొందగలరు. తద్వారా ఆమె తన స్మార్ట్‌ఫోన్‌పై పెట్టిన మొత్తాన్ని పూర్తిగా వెనక్కి పొందడంతో పాటుగా డిజిటల్‌గా ఎప్పుడూ కనెక్ట్ కాబడి ఉండటమూ సాధ్యమవుతుంది.
ఈ కార్యక్రమంను ఎంచుకున్న వినియోగదారులు ఒకసారి ఉచితంగా స్ర్కీన్ రీప్లేస్‌మెంట్‌ను పొందేందుకు అర్హులు. ఒకవేళ స్ర్కీన్ డ్యామేజీ అయితే సర్వీఫీ దీనిని భర్తీ చేస్తుంది. ఈ ఆఫర్‌తో అదనంగా 4800 రూపాయల వరకూ (12000 రూపాయల స్మార్ట్‌ఫోన్ కోసం స్ర్కీన్ మార్చేందుకు అయ్యే ఖర్చు అంచనా) ప్రయోజనం చేకూరుతుంది. ఒకసారి వినియోగదారులు అర్హత కలిగిన రీచార్జ్ ప్యాక్‌ను రీచార్జ్ చేస్తే, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌పై 90 రోజుల లోపుగా స్ర్కీన్ రీప్లేస్మెంట్ కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అపరిమిత కాలింగ్ మరియు ఉదారమైన డాటా ప్రయోజనాలతో , వినియోగదారులు విస్తృత శ్రేణిలో ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలను తమ ప్రీపెయిడ్ రీచార్జ్‌లతో పొందవచ్చు. దీనిలో ఉచిత వింక్ మ్యూజిక్ చందా మరియు 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌ను ఉచితంగా ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.
షస్వత్ శర్మ, డైరెక్టర్–మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ మాట్లాడుతూ ‘‘స్మార్ట్ఫోన్లు ఇప్పుడు కనీస అవసరాలుగా మారాయి. మరీ ముఖ్యంగా మహమ్మారి అనంతర ప్రపంచంలో వినియోగదారులు విస్తృత శ్రేణిలో సేవలను డిటిజల్గా పొందేందుకు ఉన్న అవకాశాలను వెదుకుతున్న వేళ ఇవి అవసరంగా మారాయి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వినియోగదారులు చక్కటి ఆన్లైన్ అనుభవాలను పొందేందుకు నాణ్యమైన స్మార్ట్ఫోన్లను కోరుకుంటున్నారు. తమ కోరికలనుగుణంగా తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత సులభంగా పొందే అవకాశం అందించాలన్నది మా లక్ష్యం. ఈ వినూత్నమైన కార్యక్రమంలో భాగంగా విస్తృత శ్రేణిలో మార్కెట్లోకి వినూత్న కార్యక్రమాలను తీసుకువస్తూనే ఉంటాము. వినియోగదారులకు డిజిటల్ పరంగా మరింత ఉన్నతమైన అనుభవాలను పొందేలా చేస్తాము’’ అని అన్నారు. ఎయిర్టెల్ యొక్క హైస్పీడ్ 5జీ రెడీ నెట్వర్క్, భారతదేశ వ్యాప్తంగా ప్రతి మూలకూ విస్తరించడం వల్ల వినియోగదారులు ప్రయాణ సమయంలో కూడా డిజిటల్‌గా కనెక్ట్ అయ్యేందుకు అనుమతిస్తుంది.