Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రాప్ టైగర్ డాట్ కామ్ ఈ నెల 9-10 తేదిల్లో హైదరాబాద్‌లో 'రైట్ టు హోమ్' శీర్షికన ప్రోపర్టీ ఎక్స్‌షో నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. హైటెక్ సిటీ సమీపంలోని నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ఇక్కడ గృహ కొనుగోలుదారులు నగరంలోని ప్రముఖ డెవలపర్లను కలుసుకుని అత్యుత్తమ పండుగ ఆఫర్లను పొందే అవకాశం ఉందని పేర్కొంది. ''ఆస్తి కొనుగోలుకు అత్యుత్తమ సమయంగా పండుగ సీజన్‌ను భావిస్తుంటాం. 2021 పండుగ సీజన్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైనంతగా మరే ఇతర సంవత్సరాల్లోనూ పండుగ సీజన్‌ను చూడలేదనడంలో అతిశయోక్తి లేదు. గహ రుణాలపై వడ్డీరేట్లు ఇప్పుడు అతి తక్కువగా ఉన్నాయి. ఇవి కేవలం 6.55 శాతం నుంచి కూడా లభిస్తున్నాయి.'' అని ప్రాప్‌టైగర్ డాట్ కామ్ బిజినెస్ హెడ్ రాజన్ సూద్ పేర్కొన్నారు.