Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు కె.అక్షయ్ కుమార్ (17), తవనేశ్ సిరసాటి (8)లు ‘వైట్‌హ్యాట్ జూనియర్ స్వాస్థ్ భారత్ టెక్ ఛాంప్స్’ టాప్ 50 మంది జాతీయ విజేతల్లో భాగంగా ఎంపిక కాగా, దీన్ని ‘డెటాల్ బనేగా స్వాస్థ్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించగా, ఈ కార్యక్రమాన్ని అగ్రగామి గ్లోబల్ వినియోగదారుల ఆరోగ్యం, హైజిన్ కంపెనీ రెకిట్ట్ ప్రారంభించింది. రెకిట్ట్, వైట్‌హ్యాట్ జూనియర్ ఈ ఏడాది ప్రారంభంలో యువ తరాన్ని మన దేశంలో సాంకేతికతను అలవర్చుకోవడంలో ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలకు పరిష్కరణ కనుగొనేందుకు స్ఫూర్తి నింపేందుకు భాగస్వామ్య మద్ధతును కలిగి ఉన్నాయి. కొవిడ్ సమయంలో ఇళ్లకే పరిమితమైన వారికి ఆరోగ్యం, ఫిట్నెస్ గురించి ఆందోళన చెందుతున్న వారికి కె.అక్షయ్ కుమార్ రూపొందించిన ‘మేక్ మీ హెల్తీ’ యాప్ ఆరోగ్యం, పరిశుభ్రత అన్నింటినీ ఆసక్తికరమైన పరిష్కరణలను అందిస్తుంది. కాగా, తవనేశ్ రూపొందించిచన ‘గార్బేజ్ కలెక్షన్ ట్రాకర్’ చెత్త సేకరణకు సంబంధించి ప్రజలు, అధికారులను సమన్వయం చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఈ కార్యక్రమంలో 700+ నగరాలు, పట్టణాల నుంచి 6-18 ఏళ్ల వయసు ఉన్న 10,700కుపైగా విద్యార్థులు పాల్గొన్నారు. టాప్ 50 మంది విజేతలు వ్యర్థాల నిర్వహణ, కొవిడ్-19 కేర్ మరియు టీకా ఇప్పించడం, సముదాయం, వ్యక్తిగత ఆరోగ్యం అలాగే పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం, రుతుక్రమం తదితర రంగాలకు సంబంధించి కొత్త ఐడియాలను తీసుకు వచ్చారు. ఈ 50 మంది విజేతలకు రెకిట్ట్ తలా రూ.50,000 స్కాలర్షిప్లను అందించి పరిష్కరించడమే కాకుండా సూపర్‌స్టార్, డెటాల్ బనేగా స్వాస్థ్ ఇండియా క్యాంపెయిన్ రాయబారి అమితాబ్ బచ్చన్‌తో డెటాల్, ఎన్డిటివి స్వాస్థ్ భారత్ సంపన్న భారత్ టెలిథాన్లో క్రియాశీలకంగా పాల్గొనే అవకాశాన్ని ఇచ్చింది.
బాలలు అందరితో మాట్లాడిన ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్, ‘‘బాలల మనస్సు పని చేసేందుకు సంబంధించి ఒక అద్భుతమైన అంశాన్ని కలిగి ఉంటుంది. యుక్త వయస్సు వారి అడ్డంకులను చూస్తే, బాలలు అవకాశాలను చూస్తారు. ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించి యువ విజేతల నుంచి అద్భుతమైన యాప్ ఐడియాలను చూసి భారతదేశపు భవిష్యత్తుకు నా హృదయం భరోసాతో నిండిపోయింది. నేటి ఈ యువ క్రియేటర్లు నాకు ఉన్నత అనుభవాన్ని అందించారు. నేను వారికి వారి భవిష్యత్తుకు మేలు జరగాలని కోరుకుంటాను’’ అని తెలిపారు. ‘‘ఈ బాలలు నేడు వారిని అభివ్యక్తీకరించేందుకు సాంకేతికతను అలవర్చుకుంటుండగా, వారి ఆలోచనలకు రూపం ఇస్తున్నారు. వాస్తవ పరిష్కారాలను సృష్టిస్తున్నారు. వైట్‌హ్యాట్ జూనియర్ స్వాస్థ్ భారత్ టెక్ ఛాంప్స్ కార్యక్రమం ఈ అద్భుతమైన ఉద్యమాన్ని మరోసారి ధృవీకరిస్తుంది. ఆరోగ్య సమస్యల వంటి అత్యంత ప్రముఖ సమస్యల గురించి బాలలు పలు రకాలుగా ప్రతిస్పందించారు. కొందరు ప్రజలను స్వయం సేవలకు ముందంజ వహించేందుకు క్రియాశీలం అయ్యేందుకు లేదా ఔషధాలను అందించాలని కోరుకోగా ఇతరులు వారికి వారి వ్యక్తిగత ఆరోగ్యాన్ని మెరుగు పరచేందుకు సెల్ఫ్-హెల్ప్ పరికరాలను అందించేందుకు సన్నద్ధం చేస్తుంది. కొందరు సముదాయానికి చెందిన వారి మద్ధతు క్రోఢీకరించడంలో లేదా నిర్దిష్ఠ సమస్యల గురించి జాగృతి కల్పించాలని కోరుకుంటున్నారు’’ అని వైట్‌హ్యాట్ జూనియర్ సీఈఓ తృప్తి ముక్కర్ తెలిపారు. ‘‘ఈ ఉజ్వల మనస్సులకు వెలుగును చూపించేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము. వైట్‌హ్యాట్ జూనియర్లో బాలలను క్రియేటర్లుగా చేయడాన్ని మాత్రమే మేము చేస్తున్నాము’’ అని తెలిపారు.
రెకిట్ట్ సౌత్ ఆసియా సీనియరు ఉపాధ్యక్షుడు గౌరవ్ జైన్ మాట్లాడుతూ ‘‘పలు సంవత్సరాల నుంచి డెటాల్ స్వాస్థ్ ఇండియా కార్యక్రమం భారతదేశాన్ని ఆరోగ్యకరంగా, పరిశుభ్రంగా ఉంచే అలవాట్లను అలవర్చుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చేలా ప్రాధాన్యత ఇచ్చింది. డిజిటల్ యుగంలో వైట్‌హ్యాట్ జూనియర్ స్వాస్థ్ భారత్ టెక్ ఛాంప్స్ కార్యక్రమం మనకు ఆరోగ్యం, పరిశుభ్రత సమస్యలను అధిగమించే విధానాన్ని మార్చేందుకు యువ హృదయాలను క్రియాశీలకం, స్ఫూర్తి నింపడంలో మద్ధతు ఇస్తోంది. ఈ అద్భుతమైన సాంకేతికత సంయోజన, సృజనశీలకమైన ఆలోచన అద్భుతమైన ఆలోచనలను అందించింది. ఈ తరహా సృజనశీల ఆలోచనలే మాకు దీర్ఘావధిలో స్వాస్థ్ భారత్‌ను సృష్టించడంలో సహకరించనుంది’’ అని వివరించారు.