Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్ , శాంసంగ్ తమ డిష్వాషర్ శ్రేణి IntensiveWashని భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ డిష్వాషర్లను ప్రత్యేకంగా భారతీయ వంటలను దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దారు. ఈ నూతన శ్రేణి డిష్వాషర్లు లక్షలాది మంది ఆందోళనలకు తగిన పరిష్కారం చూపగలవు. మరీ ముఖ్యంగా ఇంటి పనులతో పాటుగా ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న వారి అవసరాలను సైతం తీర్చగలవు. ఇవి వినియోగదారుల పరిశుభ్రతా అవసరాలను తీర్చడంతో పాటుగా తమ ఇంటిలో అత్యాధునిక కిచెన్ స్పేస్‌ను సృష్టించుకోవాలనే వారి కోరికనూ తీరుస్తాయి.
శాంసంగ్ యొక్క నూతన శ్రేణి డిష్వాషర్లు స్టెయిన్లెస్ స్టీల్ సిల్వర్ మరియు వైట్ కలర్స్‌లో వస్తున్నాయి. ఇవి నాలుగు మోడల్స్‌లో శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్(https://www.samsung.com/in/dishwashers/all-dishwashers/ ) పై అక్టోబర్ 07,2021 నుంచి 39,500 రూపాయల ప్రారంభ ధరతో లభ్యమవుతుంది. ఇది ఆకర్షణీయమైన ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో పాటుగా వస్తుంది. శాంసంగ్ యొక్క డిష్వాషర్లు ప్రభావవంతంగా భారతీయ కుక్వేర్ అయినటువంటి కుకర్, కడాయ్ వంటి వాటిని సైతం శుభ్రం చేయగలదె. ఇది 13 ప్లేస్ సెట్టింగ్‌తో వస్తుంది. ఇది అధిక సంఖ్యలో వంటపాత్రలను , విభిన్న పరిణామాలతో ఉన్నప్పటికీ ఒకేసారి శుభ్రపరచగలవు. ఇంటెన్సివ్ వాష్ విత్ ట్రిపుల్ రైన్స్ ఫీచర్లో మూడు సార్లు మురికి శుభ్రం చేసే సైకిల్స్ ఉంటాయి. ఇవి ప్రభావవంతంగా ప్రతి మరకనూ తొలగిస్తాయి. ఎక్కువగా అపరిశుభ్రమైన డిషెస్ ను సైతం ఇవి పూర్తిగా శుభ్రపరుస్తాయి. అంతేకాదు, 99.99% (ఇంటర్‌టెక్ ధృవీకృతం) ఆహారంపై వృద్ధి చెందే బ్యాక్టీరియాను తొలగించి ప్రకాశవంతమైన, ఆరోగ్యవంతమైన, స్వచ్ఛమైన పాత్రలను అందిస్తాయి.
ఒకసారి రైన్స్, డ్రై ప్రక్రియ పూర్తయితే, ఆటో రిలీజ్ డ్రైయింగ్ ఫీచర్, డిష్వాషర్ డోర్ ఆటోమేటిక్‌గా 10 సెంటీమీటర్లు తెరుచుకునేందుకు అనుమతించడంతో పాటుగా వేగంగా పాత్రలను ఆరేందుకు , అత్యుత్తమంగా పొడిగా మారేందుకు తగిన రీతిలో స్టీమ్‌ను అనుమతిస్తుంది. మరీ ముఖ్యంగా సంప్రదాయ పద్ధతితో పోలిస్తే ప్లాస్టిక్, చిన్న వస్తువులు మరింత వేగంగా ఈ ఫీచర్‌తో ఆరతాయి. స్టెయిన్లెస్ స్టీల్ టబ్ ను మన్నికగా ఉండేలా తీర్చిదిద్దడంతో పాటుగా నిశ్శబ్దంగా, స్వచ్ఛంగా డిష్వాషింగ్ను అందిస్తుంది. దీనివల్ల అతి తక్కువ శబ్దం ఇది అందించడంతో పాటుగా స్టెరిలైజింగ్ రైన్స్ కోసం అత్యధిక ఉష్ణోగ్రతను నిర్వహించే అవకాశమూ అందిస్తుంది. అంతేకాదు కాలం గడిచే కొద్దీ ఇది రంగు మారదు. చెడువాసనలు కలుగడాన్ని సైతం నిరోధిస్తుంది.
‘‘అత్యున్నత పరిశుభ్రతా ప్రమాణాలను నిర్వహించడం మరీముఖ్యంగా వంటగదిలో పరిశుభ్రతను నిర్వహించడం ప్రతి భారతీయ గృహానికీ అత్యంత కీలకం. మా నూతన శ్రేణి డిష్వాషర్లును భారతదేశం కోసం డిజైన్ చేయడం జరిగింది. ఇవి అత్యుత్తమ శుభ్రతను అందిస్తాయి. అదే సమయంలో విద్యుత్ ఆదా చేసి, నీటినీ ఆదా చేస్తాయి. మా నూతన శ్రేణి ఇప్పుడు వినియోగదారులు తమ జీవనశైలిని ఆధునీకరించడంలో సహాయపడటంతో పాటుగా నూతన స్ధాయి సౌకర్యంను సైతం తీసుకువస్తుంది. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కాలంలో ఎక్కువ మంది ఇంటి నుంచి పనిచేస్తున్న వేళ ఇది అవసరం’’ అని రాజు పుల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
మీ వంట పాత్రలు పూర్తి శుభ్రతతో ఉన్నాయని భరోసా అందిస్తూ శాంసంగ్ డిష్వాషర్లు ప్రత్యేకమైన ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ ఫినీష్‌తో వస్తున్నాయి. ఇది చేతి వేలి ముద్రలు, ఇతర మరకలు లాంటివి లేకుండా చేస్తుంది.
ముఖ్యమైన ఫీచర్లు:
కుండలు, పాన్స్, కడాయ్, కుక్కర్లను పూర్తిగా శుభ్రపరిచే రీతిలో ఇంటెన్సివ్‌వాష్ ప్రోగ్రామ్ తీర్చిదిద్దారు. జిడ్డు, మిగిలిన నూనె, కాలిన మరకలు, బేక్ చేయడానికి ఉపయోగించిన వంటపాత్రలు తదితరాలను శుభ్రపరిచే రీతిలో వీటిని డిజైన్ చేశారు. ఇది వంటపాత్రలను 70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో పాత్రలను కడుగుతుంది. దీని యొక్క ట్రిపుల్ రైన్స్ ఫీచర్ 99.99% బ్యాక్టీరియా (ఇంటెర్ టెక్ ధృవీకృతం)ను తొలగిస్తుంది. అందువల్ల డిషెస్, కట్లరీ, పాత్రలు ఉపయోగించడానికి సురక్షితంగా ఉంటాయి.
ఆటో రిలీజ్ డ్రై
ఆటో రిలీజ్ డోర్ ఆటోమేటిక్‌గా సైకిల్ ముగిసిన వెంటనే తెరుచుకోవడంతో పాటుగా గాలిని సర్క్యులేట్ చేసి వేగంగా ఆరబెడుతుంది. ఒకసారి రైన్స్ అండ్ డ్రై ప్రాసెస్ పూర్తి అయితే, ఈ డోర్ ఆటోమేటిక్‌గా 10 సెంటీమీటర్లు తెరుచుకుంటుంది. ఇది స్టీమ్ బయటకు పోయేందుకు తగిన అవకాశం అందిస్తుంది. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఇది మీకు వేగవంతమైన, అత్యుత్తమ డ్రైయింగ్ ఫలితాలను అందిస్తుంది.
స్టెయిన్లెస్ టబ్
మీ డిష్వాషర్ ఎప్పుడూ నూతనంగా ఉంచుకోండి. ఈ స్టెయిన్లెస్ స్టీల్ టబ్ మరింత మన్నికగా ఉండటంతో పాటుగా, నిశ్శబ్దంగా పనిచేసేలా ఉంచి, సంప్రదాయ డిష్‌వాషర్లతో పోలిస్తే మరింత శుభ్రంగా మలుస్తుంది. ఇది అతి తక్కువ శబ్దం విడుదల చేయడంతో పాటుగా అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన స్టెరిలైజింగ్ వాషెస్ను సైతం నిర్వహిస్తుంది. అంతేకాదు, కాలం గడిచే కొద్దీ రంగు మారడం జరుగదు. అలాగే చెడు వాసనలు రాకుండా సైతం ఇది అడ్డుకుంటుంది.
ఏ++ ఎనర్జీ ఎఫిషియెన్సీ
శాంసంగ్ డిష్వాషర్లు యూరోపియన్ ఎనర్జీ ప్రమాణాలకు అనుగుణంగా ఎనర్జీ స్టార్ సర్టిఫైడ్. ఇది ఏ+++ రేటింగ్‌కు సమానం. ఇది మురికి పాత్రలను సైతం ప్రభావవంతంగా అత్యున్నత స్థాయి సామర్థ్యంతో శుభ్రపరుస్తుంది. అదే సమయంలో దీని వాషింగ్ పనితీరు పరంగా ఎలాంటి ప్రభావమూ పడదు.
ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ఫినీష్
ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ఫినీష్‌తో వాషర్ ఉపరితలం చేతి వేళ్ల మరకలతో అసహ్యంగా కనిపించకుండా ఉంటుంది. అలాగే ఇతర మరకలు, మసకబారడం నిరోధిస్తుంది. అంతేకాదు, వీటిని అతి సులభంగా తుడిచి వేయవచ్చు. అందువల్ల మీ ఇల్లు ఎలాంటి తప్పులెన్నకుండనట్లు అందంగా ఉంటుంది.
విస్తృత స్ధాయి ఎల్ఈడీ డిస్ప్లే
అతి సులభమైన, మరింత సహజమైన మార్గంలో డిషెస్‌ను భారీ, ఎల్ఈడీ డిస్ప్లేతో శుభ్రపరచవచ్చు. ఇది సులభంగా చదువవచ్చు. మీరు వేగంగా స్టాటస్, సెట్టింగ్స్ పరీక్షించవచ్చు. అలాగే మిగిలిన సమయం, సైకిల్ ప్రోగ్రెస్‌ను ఒకేసారి దూరం నుంచి కూడా చూడొచ్చు. అందువల్ల, మీరు అప్రయత్నంగానే వాషింగ్ పనితీరును పర్యవేక్షించడం, నియంత్రించడం చేయవచ్చు.
స్మార్ట్ లీకేజ్ సెన్సార్
నీరు లీక్ కాకుండా స్మార్ట్ లీకేజ్ సెన్సార్ కాపాడుతుంది. ఇది తక్షణమే సైకిల్ ఆపడంతో పాటుగా నీటిని బయటకు పంపి, ఎక్కడైనా నీరు లీక్ అయితే లోపం ఉన్నట్లుగా సందేశాన్ని చెబుతుంది.
హైట్ ఎడ్జస్ట్మెంట్
హైట్ ఎడ్జస్ట్మెంట్ అవకాశంతో భారీ సైజ్ పాత్రలను సైతం డిష్వాషర్లో క్లీన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఒకరు అతి సులభంగా అప్పర్ ర్యాక్‌ను ఎడ్జస్ట్ చేయడం చేయవచ్చు. తద్వారా వారు భారీ సైజు కడాయ్ లేదా పాన్స్ను ర్యాక్‌లలో ఎలాంటి గీతలు లేదా అప్పర్ ర్యాక్‌ను తాకకుండా క్లీన్ చేయవచ్చు.
లెస్ నాయిస్:
ఇన్సులిన్ సాంకేతికత శక్తివంతమైనది. ఇది సాధారణ కన్వర్షన్ కన్నా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. కిచెన్ నిశ్శబ్దంగా ఉండేలా సైలెంట్ వాషెస్ చేసే ఈ డిష్వాషర్ 44డెసిబల్, 52 డెసిబల్ స్ధాయిలో ఉంటుంది.