Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్లో గ్రామీణ భారతదేశంవైపు వెలుగులు చిందించే దిశలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, కామన్ సర్వీసెస్ సెంటర్స్ (CSC)10,000కు పైగా ఆఫర్లతో ఫెస్టివ్ ట్రీట్స్ 3.0 క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. బ్యాంకు 2020 నుంచి సుమారు పది రెట్లు ఎక్కువగా, ఈ ఏడాది ఫెస్టివ్ ట్రీట్స్ కార్డులు, రుణాలు, ఈజీ ఇఎంఐల నుంచి 10,000కుపైగా ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఏడాది ఫెస్టివ్ ట్రీట్స్ ‘కరో హర్ దిల్ రోషన్’ అనే నినాదాన్ని కలిగి ఉంది. ఇది అత్యంత చిన్న పనినీ ఎక్కువ పరిణామం పడేలా, ఇతరుల జీవితాలను పరివర్తిస్తామన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. బ్యాంకు 10,000+ వ్యాపారులతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ప్రతి భారతీయుల వ్యక్తిగత, వాణిజ్య, వ్యవసాయ అవసరాలను సిఎస్సి ద్వారా వితరణ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, ఇది భారతదేశంలో అత్యంత పెద్ద థర్డ్ పార్టీ వితరణ ఛానెల్‌గా ఉంది.
తమదే అయిన హై-ఎండ్ స్మార్ట్ ఫోన్‌ను కోరుకునే రిటెయిల్ వినియోగదారుల నుంచి దుకాణ్‌దార్ ఓవర్ డ్రాప్ట్ అవసరం ఉన్న దుకాణదారుల వరకు లేదా కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేసుకోవాలని కోరుకుంటూ, నిరీక్షిస్తున్న రైతులకు ఫెస్టివ్ ట్రీట్స్ 3.0 ప్రతి ఒకరికీ ఆఫర్లను అందిస్తుంది. ‘‘మా విఎల్‌ఇలు పలు కుటుంబాల జీవితాలను మార్చివేశారు. వారు అన్ని వ్యక్తిగత, వాణిజ్య, వ్యవసాయ అవసరాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు మరియు ఖాతా ప్రారంభించడం, రుణాలకు ఇండియా, భారతదేశం మధ్య అంతరాన్ని భర్తీ చేశారు. మా విఎల్‌ఇలు, వారి వినియోగదారులకు ఎక్కువ ఆఫర్లు, అవకాశాల ద్వారా ఉత్సాహం, సంతోషం తీసుకు వచ్చే సమయంగా ఉంది’’ అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు గవర్నమెంట్ అండ్ ఇనిస్టిట్యూషనల్ బిజినెస్, సిఎస్సి, స్టార్టప్స్ అండ్ ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్ గ్రూపు హెడ్ స్మితా భగత్ తెలిపారు. సిఎస్సి ఎస్పివి మేనేజింగ్ డైరెక్టర్ డా.దినేశ్ కుమార్ త్యాగి మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది ఫెస్టివ్ ట్రీట్స్కు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు భాగస్వామ్యంలో చాలా ఉత్సాహంగా ఉన్నాము. వినియోగదారులు, దుకాణదారులు, రైతులకు మేము అందుబాటులోకి తీసుకు వస్తున్న 10,000కు పైగా ఆఫర్లు ఈ పండుగ సీజన్లో లావాదేవీలను ఉత్తేజిస్తుంది. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పండుగ సీజన్లో కొనుగోళ్లకు సులభంగా నగదు లభించేందుకు మద్ధతు లభిస్తుంది’’ అని పేర్కొన్నారు.