Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రస్తుత ఏడాది సెప్టెంబర్లో జీవిత బీమా కంపెనీల మొదటి ఏడాది పాలసీల ప్రీమియం ఆదాయం 22.2 శాతం పెరిగింది. ఈ మాసంలో రూ.31,001 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. 2020 ఇదే మాసంలో రూ.25,336 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేశాయి. దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీకి గడిచిన సెప్టెంబర్లో తొలి ఏడాది ప్రీమియం 11.5 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లో కొత్త పాలసీలకు సంబంధించిన ప్రీమియం 5.8 శాతం పెరిగి రూ.1,31,982 కోట్లకు చేరింది