Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శాంసంగ్, ఇప్పుడు గెలాక్సీ 5జీ ప్రచారం ప్రారంభించడంతో పాటుగా పండుగ సీజన్ కోసం అతిపెద్ద 5జీ ఉత్పత్తుల జాబితాతో భారతదేశంలో తమ 5జీ వాగ్ధానాన్ని బలోపేతం చేసింది. ఈ తాజా శ్రేణి గెలాక్సీ 5జీ స్మార్ట్ఫోన్లను శక్తివంతమైన ఆవిష్కరణలు విస్తృతశ్రేణిలో అభిమానులకు అందుబాటులో ఉండే రీతిలో ఆవిష్కరించారు.గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్ఫోన్శాంసంగ్డాట్కామ్, ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసినరిటైల్స్టోర్లవద్ద 20,999 రూపాయలకు లభ్యమవుతుంది. ‘‘అర్ధవంతమైన ఆవిష్కరణలను వినియోగదారులకు తీసుకుని వచ్చే మహోన్నత వారతస్వం శాంసంగ్ కలిగి ఉంది మరియు నూతనంగా ఆవిష్కరించిన గెలాక్సీ 5జీ స్మార్ట్ఫోన్లు అపరిమిత అవకాశాలను తెరువడంతో పాటుగా వినియోగదారులను భవిష్యత్ సిద్ధంగా మలుస్తాయి. ఇటీవలనే ఆవిష్కరించిన గెలాక్సీ ఏ52ఎస్ 5జీ; గెలాక్సీ ఎం52 5జీ మరియు గెలాక్సీ ఎఫ్ 42 5జీ వంటివి అర్థవంతమైన సాంకేతికత మరియు ఉత్పత్తులను తీసుకురావడంలో శాంసంగ్ నిబద్ధతకు నిదర్శనంగా నిలువడంతో పాటుగా కామ్కా 5జీ స్మార్ట్ఫోన్లుగా వైవిధ్యంగా నిలుస్తాయి. ఒకసారి 5జీ సేవలను వాణిజ్యీకరించిన తరువాత మా వినియోగదారులు ఆ ప్రయోజనాలను తొలుత పొందేలా తోడ్పడాలన్నది మా లక్ష్యం. అందువల్ల, వారు సూపర్‌ఫాస్ట్ వేగాన్ని ఆస్వాదించడంతో పాటుగా అతి తక్కువ లాటెన్సీ మరియు మృదువైన స్ట్రీమింగ్‌ను సైతం ఆస్వాదించగలరు’’ అని ఆదిత్య బబ్బర్, సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్, మొబైల్ మార్కెటింగ్, శాంసంగ్ ఇండియా అన్నారు.
గెలాక్సీ 5జీ
2009 నుంచి 5జీ సాంకేతిక అభివృద్ధిలో అగ్రగామిగా శాంసంగ్ నిలుస్తుంది.5జీ సాంకేతికత ప్రమాణాకీరణలో అగ్రగామి పాత్రను ఇది పోషిస్తుంది.2019లో ప్రపంచంలోనే తొలిసారిగా 5జీ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్10ను ఆవిష్కరించిన తరువాత , శాంసంగ్‌కు ఇప్పుడు విస్తృత శ్రేణిలో 5జీ ఉపకరణాల జాబితా అంతర్జాతీయంగా ఉంది. చిప్సెట్స్, రేడియోలు, కోర్ సహా సమగ్రమైన 5జీ పరిష్కారాలను విజయవంతంగా అందించడంలోనూ ఇది ముందుంది. భారతదేశంలో 5జీ నెట్‌వర్క్‌ను వాణిజ్యీకరించడానికి ముందుగానే, శాంసంగ్ ఓ అడుగు ముందుకేసి తమ వినియోగదారులను భవిష్యత్‌కు సిద్ధంగా మలుస్తూ 12 వరకూ 5జీ బ్యాండ్లకు మద్దతునందించే స్మార్ట్ఫోన్లు – ఎన్1, ఎన్3, ఎన్5, ఎన్7, ఎన్8, ఎన్20, ఎన్28, ఎన్38, ఎన్40, ఎన్41, ఎన్66 మరియు ఎన్ 78కు మద్దతునందిస్తుంది. గెలాక్సీ 5జీతో, భారతదేశంలో ఎలాంటి 5జీ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చినప్పటికీ మా వినియోగదారులు ఖచ్చితమైన 5జీ కనెక్టివిటీని పొందగలరు మరియు అవాంతరాలు లేని రీతిలో జాతీయ స్ధాయిలో ఏదైనా 5జీ నెట్‌వర్క్‌ను చేరుకోగలరు. ఈ సౌకర్యవంతమైన 5జీ మద్దతుతో అత్యంత వేగవంతంగా డౌన్లోడ్ చేయడం, పంచుకోవడం, కంటెంట్ స్ట్రీమింగ్ చేయడం చేయవచ్చు. శాంసంగ్, మూడేళ్ల పాటు తరచుగా ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ఆధునీకరిస్తామనే వాగ్ధానం చేస్తుంది. అందువల్ల, మీరు మిగిలిన వారి కన్నా ఎంతో దూరం ముందు ఉండగలరు. శాంసంగ్ యొక్క విస్తృత శ్రేణి 5జీ ఉపకరణాలు కేవలం శక్తివంతమైనవి మాత్రమే కాదు, మా వినియోగదారులు భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్నారనే భరోసానూ అందిస్తుంది. ప్రస్తుతం స్మార్ట్ఫోన్లను 2–3 సంవత్సరాల నడుమ మార్చుకోవడం కనిపిస్తుంది. అందువల్ల, నేడు ఎలాంటి అసౌకర్యానికీ గురి చేయకుండా ఉపకరణాలను అందించడం అత్యంత ఆవశ్యకతతో కూడిన అంశంగా మారింది. అదే సమయంలో ఈ ఉపకరణాలు భవిష్యత్‌లో సైతం పనితీరు పరంగా శక్తివంతంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. శాంసంగ్ యొక్క 5జీ ఆఫరింగ్‌లో 12 బ్యాండ్ల వరకూ మద్దతు లభిస్తుంది మరియు మూడు సంవత్సరాల వరకూ ఓఎస్ అప్‌గ్రేడ్స్ లభిస్తుంది. తద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చనుంది. గెలాక్సీ 5జీ శ్రేణి ఫ్యూచర్ రెడీ స్మార్ట్ఫోన్లలో అత్యాధునిక గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్3, ప్రతిష్టాత్మక గెలాక్సీ ఎస్ 21 సిరీస్, అభిమానుల గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ఈ 5జీ మరియు గెలాక్సీ ఏ22 5జీ , గెలాక్సీ ఎం52 5జీ, గెలాక్సీ ఎం 32 5జీ మరియు గెలాక్సీ ఎఫ్ 42 5జీ ఉన్నాయి. అత్యంత ప్రాచుర్యం పొందిన 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే మరియు క్వాడ్ రియర్ కెమెరా వంటి ఆవిష్కరణలతో , గెలాక్సీ ఏ52ఎస్ 5జీ భవిష్యత్‌కు సిద్ధంగా ఉండటంతో పాటుగా 12 బ్యాండ్ 5జీ మద్దతును అందిస్తుంది. గెలాక్సీ ఏ52ఎస్ 5జీ ప్రత్యేకమైన పండుగ ప్రారంభ ధర 29999 రూపాయలలో లభ్యమవుతుంది. దీనిలో బ్యాంక్ క్యాష్‌బ్యాక్ కూడా మిళితమై ఉంటుంది. మార్పిడి ఆఫర్లు సైతం దీనిలో భాగంగా ఉంటాయి. ఈఆఫర్లు రిటైల్ స్టోర్లు, శాంసంగ్ డాట్ కామ్, సుప్రసిద్ధ ఆన్లైన్ పోర్టల్స్ వద్ద లభ్యమవుతుంది. గెలాక్సీ ఎం52 5జీ, అతి సన్నటి మరియు అత్యంత శక్తివంతమైన ఎం సిరీస్ స్మార్ట్‌ఫోన్. కేవలం 7.4 మిల్లీమీటర్ల సన్నటి డిజైన్ మరియు 6ఎన్ఎం స్నాప్‌డ్రాగన్ 77జీ చిప్సెట్, 11 5జీ బ్యాండ్ల మద్దతుతో లభిస్తుంది. గెలాక్సీ ఎం52 5జీ పండుగ ప్రత్యేక ధర 23,499 రూపాయలలో లభ్యమవుతుంది. దీనిలో క్యాష్‌బ్యాక్ మరియు మార్పిడి ఆఫర్లు సైతం భాగంగా ఉంటాయి. ఇవి శాంసంగ్ డాట్ కామ్, అమెజాన్ డాట్ ఇన్ మరియు ఎంపికచేసిన రిటైల్ స్టోర్ల వద్ద లభ్యమవుతుంది. 5జీ కనెక్టివిటీ కలిగిన మొట్టమొదటి ఎఫ్సిరీ స్స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్ 42 5జీ, ఇది 12 బ్యాండ్ 5జీ మద్దతునందిస్తుంది.గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ డాట్‌కామ్, ఫ్లిప్కార్ట్మరియుఎంపికచేసినరిటైల్స్టోర్లవద్ద 20,999 రూపాయలకు లభ్యమవుతుంది. వచ్చేవారం నుంచి ఆరంభించి, వినియోగదారులు గెలాక్సీఎఫ్ 42 5జీ కొనుగోలుచేసినఎడల 4500 రూపాయల విలువ కలిగిన ఉత్సాహపూరిత ఆఫర్లను సైతం పొందగలరు.