Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉన్నతవిద్యలో ఆవిష్కరణలను తీసుకురావడంతో పాటుగా విజ్ఞాన సమాజంలో అభివృద్ధి చెందుతున్న విభాగాలలో అభ్యాసం తీసుకురావాలనే లక్ష్యంతో, లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ నిట్ యూనివర్శిటీ (ఎన్యు) తమ 11వ స్నాతకోత్సవ వేడుకలను వర్ట్యువల్గా నిర్వహించింది. ఈ వర్ట్యువల్ స్నాతకోత్సవ వేడుకలో గ్రాడ్యుయేటింగ్ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, పారిశ్రామిక నాయకులు, అతిథులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ స్నాతకోత్సవంలో ప్రతి గ్రాడ్యుయేట్ తమ సర్టిఫికెట్ను నిట్ యూనివర్శిటీ అధ్యక్షులు ప్రొఫెసర్రాజేశ్ ఖన్నా మరియు డాక్టర్ అరుణభా ఘోష్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉ సీఈఈడబ్ల్యు వద్ద నుంచి అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్యు ఫౌండర్ మరియు నిట్ లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ రాజేంద్ర ఎస్ పవార్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ అభినందనలు. వారు భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను. యూనివర్శిటీ వద్దవారు అందుకున్న పరిశ్రమ ఆధారిత , పరిశోధనా సంబంధిత విద్య వారి జీవితాలకు తగిన మార్గనిర్ధేశకత్వ చేయనుంది. సంక్షోభ సమయంలో కూడా ధైర్యంగా ముందుకు సాగడానికి ఈ పాఠాలు వారికి దోహదపడనున్నాయి అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ అరుణభ ఘోష్ విద్యార్థులు సాధించిన విజయాలను అభినందించారు. అత్యాధునిక సాంకేతికతలను వినియోగించడంలో విద్యార్థులకు తర్ఫీదునివ్వడం పట్ల ఎన్యును అభినందించడంతో పాటుగా సస్టెయినబల్ డెవలప్మెంట్ దిశగా ఎన్యు చేపట్టిన కార్యక్రమాలను ప్రశంసించారు.
నిట్ యూనివర్శిటీ అధ్యక్షులు ప్రొఫెసర్ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ నిట్ యూనివర్శిటీ వద్ద మా అందరికీ ఇది గర్వకారణమైన క్షణం. మా పదకొండవ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ ఇది అని అన్నారు.