Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎంజీ మోటార్స్ సోమవారం భారత మార్కెట్లోకి ఆస్టర్ ఎస్‌యూవీని విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ 9.78 లక్షలుగా నిర్ణయించింది. ఈ కంపెనీ ఇప్పటికే భారత్‌లో హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్, జడ్ఎస్ ఈవీలను విడుదల చేయగా.. ఆస్టర్ ఐదవ మోడల్ కానుంది. దీన్ని పెట్రోల్ వెర్షన్లో తీసుకువచ్చింది. ఈనెల 21 నుంచి దీని బుకింగ్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. అత్యాధునిక ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ ఫీచర్లతో ఎంజి వినియోగదారులను ఆకట్టుకోనుందని ఆ కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.