Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బాలీవుడ్ నటి కృతి సనన్‌ను తన బ్రాండ్ కొత్త ప్రచారకర్తగా నియమించుకున్నట్లు యార్డ్లీ ప్రకటించింది. ఆమెతో కలిసి తెరకెక్కించిన టి.వి.వాణిజ్య ప్రకటనల్లో ప్రకృతి పరికల్పను దృష్టిలో ఉంచుకుని రూపొందించగా, అందులో కృతి విశ్వాసపూర్వకంగా మరియు స్వతంత్ర భావాలున్న యువతిగా ప్రపంచంలో ముందంజలోకి వస్తున్న యువతిగా కనిపిస్తారు. ఈ టెలివిజన్ వాణిజ్య ప్రచార చిత్రం డిజిటల్ క్యాంపెయిన్‌తో సహా పలు ఛానెళ్లలో ప్రసారం కానుంది. విస్తృతమైన ప్రింట్ క్యాంపెయిన్‌ను సాధారణమైన, ఆధునిక వ్యాపారాలు, ఇ-కామర్స్ సైట్లలో నిర్వహించనున్నారు. ఇది కొత్త క్యాంపెయిన్‌కు 360-డిగ్రీ విజిబిలిటీని అందిస్తుంది.
అత్యుత్తమ పరిమళాల 250 ఏళ్ల పరంపరను కలిగిన యార్డ్లీ సహజసిద్ధంగా నిలిచి ఉంది. అన్ని తరాల వారి ఆదరణను చూరగొంది. ఇది మహిళలకు వారి సహజ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు స్ఫూర్తి నింపడంలో వారిదే అయిన అత్యుత్తమ ఎడిషన్ల కోసం బయటకు అడుగు వేయడంలో నమ్మకాన్ని ఉంచింది. నేడు యువ నటిగా గుర్తింపు పొందిన కృతి సనన్ శక్తియుతమైన ధ్వని కలిగిన మహిళగా, మార్పును సృష్టించేందుకు శ్రమిస్తున్నారు. ఈ బ్రాండ్‌తో తన భాగస్వామ్యం గురించి కృతి సనన్ మాట్లాడుతూ, ‘‘ప్రకృతి తనదే అయిన రీతిలో మిమ్మల్ని ప్రకాశవంతం చేస్తుంది. ఈ భావన రోజంతా ఉండడాన్ని ఒకసారి ఊహించుకోండి! యార్డ్లీ అంతే హితాన్ని మరియు నవోత్సాహాన్ని నింపుతుంది. యార్డ్లీ లండన్‌కు పూల ప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు నేను నిజంగా ఉత్సుకతతో ఉన్నాను’’ అని తెలిపారు.
యార్డ్లీ ఇండియా బిజినెస్ హెడ్ మనీశ్ వ్యాస్ మాట్లాడుతూ ‘‘ఈ కొత్త క్యాంపెయిన్ వెనుక ఉన్న వ్యూహ విధానాన్ని ఆవిష్కరించారు. ‘‘ఈ బ్రాండ్ అత్యుత్తమ ప్రకృతిసిద్ధమైన పదార్థాలను కలిగి ఉంది. ఇంగ్లండ్‌లోని తోటల విశిష్ట పుష్పాలను వినియోగించుకుంటున్నందుకు గర్వపడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేము ‘ప్రకృతి లాంటి తాజాదనం’’ అనే ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాము, యార్డ్లీ పరిమళాలు అనన్యం మరియు అపేక్షణీయంగా ఉన్నాయి. ఈ సరికొత్త విడుదలలో భాగంగా యార్డ్లీ డియోలను ఇప్పుడు 90% ప్రకృతి సిద్ధంగా పొందిన ఉత్పత్తులతో తయారు చేశాము. మేము 2 కొత్త ఫ్యూజన్ వేరియెంట్లు- స్కాటిష్ మెడోస్, స్ర్పింగ్ బ్లాసమ్ను పరిచయం చేస్తున్నాము. ఈ క్యాంపెయిన్‌కు మేము కృతి సనన్‌తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా, వారు విశ్వసనీయతను ప్రతిబింబిస్తారు. నేటి మహిళలకు సహజసిద్ధమైన స్ఫూర్తిగా నిలుస్తారు’’ అని పేర్కొన్నారు. ఈ వాణిజ్య చిత్రాన్ని ఉండర్మ్యాన్ థాంప్సన్ గ్రూపు మరియు డబ్ల్యూపిపి నెట్వర్ కు సభ్యుడు కాంట్రాక్ట్ అడ్వర్టైజింగ్ రూపొందించింది.
కాంట్రాక్ట్ ముంబయి జనరల్ మేనేజర్ అయన్ చక్రవర్తి మాట్లాడుతూ ‘‘ఈ వాణిజ్య చిత్రం వెనుక స్ఫూర్తి గురించి వివరిస్తూ, ‘‘తాజా పుష్పాలు మరియు వాటి పరిమళంలో మాంత్రికత ఉంది. అవి మనస్థితి, విశ్వాసంలో మార్పును తీసుకు వచ్చే పరిణామాన్ని కలిగి ఉంటాయి. యార్డ్లీ డియోల ప్రకృతిసిద్ధమైన పూల పరిమళం మీకు కొత్తదనాన్ని, విశ్వాసంలో ఉంచేలా చేస్తాయనేది ఇక్కడ ప్రముఖ అంశంగా ఉంది’’ అని వివరించారు. కాంట్రాక్ట్ ముంబయి ఎగ్జిక్యూటివ్ క్రియేటివ్ డైరెక్టర్ రాహుల్ ఘోష్ ఈ వాణిజ్య ప్రకటన సృజనశీలత ఆలోచన గురించి మాట్లాడుతూ ‘‘యార్డ్లీ పరంపర కలిగిన బ్రాండ్, దాని పరిమళాలు, పూల పరంపర, భారతదేశంలో యార్డ్లీ స్థానికీకరణ, దాని ఉద్దేశిత వినియోగదారులకు తదుపరి అడుగు వేసే క్షణాలను సృష్టించేదిగా ఉంటుంది. ఈ కథ యార్డ్లీ పరిమళం ఎలా మార్పు తీసుకు వస్తుంది మరియు పూల ప్రపంచాన్ని సృష్టిస్తుంది అనే దాన్ని సుందరంగా నిరూపణ చేస్తుంది. మన పాత్రకు ప్రత్యేక క్షణాన్ని సృష్టిస్తుందో తెలియజేస్తుంది’’ అని వివరించారు. కొత్త,మెరుగైన యార్డ్లీ డియోడరెంట్లు సమీపంలోని స్టోర్లలో, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారాల్లో 150 ఎంఎల్‌కు రూ.209 ధరలో లభిస్తుంది.