Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అల్లూర్ ఇన్ఫ్రాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు అసెట్స్ అండ్ మోర్ వ్యవస్థాపకులు హను యెడ్లూరి తెలిపారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిని వ్యవస్థీకతంగా మారుస్తూ, ఇన్వెస్టర్లకు అద్దెల రూపంలో నెలవారీ కచ్చితమైన ఆదాయాన్ని అందించడమే తమ సంస్థ ఉద్దేశ్యమన్నారు. హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రైమ్ ఏరియాల్లో ఉండే వాణిజ్య భవనాల్లో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ (తక్కువ మొత్తంలో భాగస్వామ్య హక్కు) తీసుకుని, ఇన్వెస్టర్లు ఖచ్చితమైన నెలవారీ అద్దె రూపంలో ఆదాయం పొందేందుకు తమ సంస్థ సహాయపడుతుందన్నారు. ప్రధాన నగరాల్లో వాణిజ్యపరంగా ప్రైమ్ ఏరియాల్లోని కమర్షియల్ ప్రాజెక్టుల్లో ఎవరైనా రూ.25-30 లక్షల ప్రారంభ పెట్టుబడితో వాటాలు తీసుకోవచ్చన్నారు.. ఇప్పటికే వాసవీ గ్రూప్, శాంతా శ్రీరామ్‌తో మెగా డీల్ కుదర్చుకున్న విషయాన్ని ఆ సంస్థ గుర్తు చేసింది. ఇకపై అసెట్స్ అండ్ మోర్ తమ ప్రాపర్టీలకు ఫండింగ్, మేనేజ్మెంట్ సహా నిర్వాహణ సేవలను అందించనుందని అల్లూర్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సిఇఒ దిలీప్ సి బైరా తెలిపారు.