Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సుప్రసిద్ధ అంతర్జాతీయ స్మార్ట్ ఉపకరణాల బ్రాండ్, ఒప్పో తమ ప్రత్యేక ఎడిషన్స్‌ను ఈ పండుగ సీజన్ కోసం ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఉత్పత్తి శ్రేణిలో పూర్తి సరికొత్త ఒప్పో రెనో 6 ప్రో 5జీ గోల్డ్ దివాలీ ఎడిషన్ ను 41,990 రూపాయలకు ; ఎఫ్ 19 ఎస్‌ను 19,990 రూపాయలకు మరియు ఎన్కో బడ్స్‌ను నూతన బ్లూ కలర్ వేరియంట్లో 1999 రూపాయలకు అందిస్తున్నారు. ఒప్పో ఎఫ్19ఎస్, ఒప్పో రెనో6 ప్రో 5జీ దివాలీ ఎడిషన్ మరియు ఒప్పో ఎన్కో బడ్స్ బ్లూ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మరియు ప్రధానస్రవంతి రిటైలర్ల వద్ద లభ్యమవుతాయి. ఈ ప్రత్యేక ఎడిషన్ ఆవిష్కరణలు, ఒప్పో యొక్క పండుగ కార్యక్రమం ‘లైట్ అప్ న్యూ బిగినింగ్స్’ (నూతన ఆరంభాలకు శ్రీకారం చుట్టండి)లో భాగం. ఈ ప్రచారం ద్వారా, ఈ బ్రాండ్ ప్రజలకు సంతోషం మరియు సానుకూలతను విస్తరించడాన్ని ప్రోత్సహిస్తుంది. దమయంత్ సింగ్ ఖనోరియా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్– ఒప్పో ఇండియా ఈ నూతన ఎడిషన్స్‌ను # ఆస్క్ ఒప్పో ఇంటరాక్టివ్ సదస్సులో ఆవిష్కరించారు. కమెడియన్ రాహుల్ సుబ్రమణియన్ చేత ఈ సదస్సును నిర్వహించారు. దీనిలో భాగంగా తమ కమ్యూనిటీని ఆహ్వానించిన ఒప్పో, బ్రాండ్‌తో కనెక్ట్ కావాల్సిందిగా, తమ సందేహాలకు తగిన సమాధానాలను పొందాల్సిందిగా ఆహ్వానించింది. ఒప్పో సోషల్ మీడియా హ్యాండిల్ # ఆస్క్ ఒప్పో వినియోగించి వినియోగదారులు సంధించిన ప్రశ్నలలో కొన్నింటికీ దమయంత్ సమాధానం అందించారు.
పూర్తి సరికొత్త ఒప్పో రెనో6 ప్రో 5జీ దివాలీ ఎడిషన్, మెజిస్టిక్ గోల్డ్ కలర్లో , దానికి సరిపోయే వాల్‌పేపర్, యుఐ మరియు చార్జింగ్ ఇంటర్ఫేజ్తో వస్తుంది. ఒప్పో రెనో 6 ప్రో 5జీలో పరిశ్రమలో మొట్టమొదటి బోకె ఫ్లేర్ పోరె్ట్రయిట్ వీడియో ఉంది. ఇది సినిమాటిక్ బొకే ఫ్లేర్ ఎఫెక్ట్స్‌ను పోట్రెయిట్స్ మరియు ఏఐ హైలైట్ వీడియోలో అందిస్తుంది. ఇది వాస్తవ సమయంలో మీరు ప్రొఫెషనల్ గ్రేడ్ వీడియోలను ఒడిసిపట్టే అవకాశం అందిస్తుంది. రెనో 6 ప్రో 5జీ లో అత్యాధునిక ప్లాగ్‌షిప్ మీడియా టెక్ డిమెన్సిటీ 12000 చిప్సెట్, ఒప్పో యొక్క ప్రత్యేకమైన రెనో గ్లో డిజైన్ , స్మార్ట్ 5జీ సామర్థ్యం, కలర్ ఓఎస్ 11.3, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 65 వాట్ సూపర్‌వూక్ 2.0 ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి సన్నటి, తేలికపాటి బాడీలో ఇమిడి ఉన్నాయి. ఒప్పో రెనో 6 ప్రో 5జీ దీపావళి ఎడిషన్‌తో పాటుగా ఒప్పో ఇప్పుడు తమ ప్రత్యేక ఎడిషన్ ఒప్పో ఎఫ్ 19ఎస్‌ను సైతం భారతదేశంలో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అతి సన్నగా ఉండటంతో పాటుగా 5000ఎంఏహెచ్‌బ్యాటరీని కలిగి ఉంది. ఇది అమోలెడ్ డిస్ప్లే తో పాటుగా ఒప్పో యొక్క ప్రొప్రైయిటరీ 33 వాట్ ఫ్లాష్ చార్జింగ్ సాంకేతికతను సైతం కలిగి ఉంది. ఇది అత్యధిక స్థాయి భద్రతను తమ నైట్ చార్జింగ్ రక్షణ మరియు ఉష్ణోగ్రత నియంత్రణతో కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం 72 నిమిషాలలో పూర్తిగాచార్జ్ చేయవచ్చు మరియు మీరు 5గంటల 45 నిమిషాల కాలింగ్‌ను లేదా 2 గంటల యూట్యూబ్ వీక్షణను కేవలం 5 నిమిషాల రీచార్జ్‌తో ఆశించవచ్చు. పండుగ నేపథ్యం దృష్టిలో పెట్టుకుని , ఈ నూతన ప్రత్యేక ఎడిషన్ ఒప్పో ఎఫ్19ఎస్‌లో భారతదేశపు మొట్టమొదటి ఏజీ డిజైన్ సైతం ఉంది. ఇది ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేక గోల్డ్ కలర్ అందిస్తుంది. ఎఫ్ 19ఎస్ , ప్రస్తుత ఎఫ్ సిరీస్ శ్రేణికి అదనపు జోడింపుగా ఉంటుంది. దీనిలో ఎఫ్19, ఎఫ్ 19 ప్రో మరియు ఎఫ్ 19 ప్రో+ 5జీ భాగంగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ గోల్డెన్ రంగులలో లభ్యమవుతుంది.
వీటితో పాటుగా, ఒప్పో ఇప్పుడుతమ ప్రవేశ దశ ఎన్కో బడ్స్ బ్లూ సైతం ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నూతన టీడబ్ల్యుఎస్ కాన్సర్ట్ తరహా ఆడియో అందిస్తుంది. దీనిలో ఏఐ ఆధారిత కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ఉంది. ఇది 24 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. ఈ ఆఫరింగ్‌ను ప్రత్యేకంగా తమ వైర్డ్ మరియు సంప్రదాయ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌ను తమ మొట్టమొదటి అసలైన వైర్లెస్ ఇయర్‌బడ్స్ కోసం ఆధునీకరించుకోవాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా నిర్మించారు.
తమ ప్రచారం మరియు రాబోతున్న ఆవిష్కరణలను గురించి దమయంత్ సింగ్ ఖనోరియా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్– ఒప్పో ఇండియా మాట్లాడుతూ ‘‘ మానవజాతికి అనుకూలమైన సాంకేతికతను నిర్మించడాన్ని ఒప్పో విశ్వసిస్తుంది. మా ఉత్పత్తులు ఈ నిబద్ధతకు అసలైన ప్రతీకలుగా నిలుస్తాయి మా ప్రత్యేక ఎడిషన్ శ్రేణిని ఆవిష్కరిస్తుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇవి సానుకూలతను వ్యాప్తి చేయడమే కాదు, పండుగ సంతోషాన్నీ వ్యాప్తి చేస్తాయి. మీరు ఒకవేళ నూతన తరపు వీడియో క్రియేటర్‌గా వీడియోగ్రఫీ సూపర్‌ఫోన్ కావాలనుకున్నా లేదంటే అత్యంత ఆకర్షణీయమైన రీతిలో ఉన్నటువంటి సన్నటి స్మార్ట్‌ఫోన్ కావాలనుకున్నా , మా దగ్గర ప్రతి ఒక్కరికీ ఒకటి అందుబాటులో ఉంటుంది’’ అని అన్నారు.