Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్లలో కొనసాగిన పరుగు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు పరుగులు పెట్టాయి. గురువారం సెషన్లోనూ భారీ లాభాలను ఆర్జించాయి. ఐఆర్సీటీసీ షేరు ఏకంగా రూ.5000 మార్క్‌ను దాటింది. ఒక్క పూటలోనే 11.28 శాతం లేదా రూ.556.20 పెరిగి రూ.5,485కు ఎగిసింది. 2019లో లిస్టింగ్‌కు వచ్చిన ఈ షేరు ఇప్పటి వరకు 610 శాతం పెరిగింది. రూ.664 వద్ద ప్రారంభమైన ఈ సూచీ కేవలం రెండేండ్లలోనే మదుపర్లకు భారీ లాభాలను పంచింది. అంతర్జాతీయ సానుకూల అంశాలతో భారత మార్కెట్లు రాణించాయి. కొనుగోళ్ల మద్దతుతో తుదకు బిఎస్ఇ సెన్సెక్స్ 568.90 పాయింట్లు పెరిగి 61,305.95కు చేరింది. నిఫ్టీ 176.70 పాయింట్లు పెరిగి 18,338.50 వద్ద ముగిసింది. బిఎస్ఇలో సుమారు 1596 షేర్లు లాభపడగా.. 1541 షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, విప్రో, గ్రాసీమ్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సూచీలు అధిక లాభాలు ఆర్జించిన వాటిలో ముందు వరుసలో ఉండగా.. కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో టాప్‌లో ఉన్నాయి.