Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనా పీపుల్స్ బ్యాంకు వెల్లడి
బీజింగ్ : చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్గ్రాండేలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించుకోవచ్చని చైనా సెంట్రల్ బ్యాంకు పేర్కొంది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి ఎవర్గ్రాండేను కాపాడవచ్చునని, ఇంతకుమించి పెరుగనివ్వబోమని హామీ ఇచ్చింది. ఎవర్గ్రాండేలో నగదు కొరతపై ఆందోళన నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ రియాల్టీ రంగాన్ని బలోపేతం చేయడానికి కఠిన చర్యలు చేపట్టారు. మార్కెట్ ఓరియెంటెడ్, రూల్ ఆఫ్ లా ప్రిన్సిపుల్స్ ఆధారంగా స్థానిక ప్రభుత్వాలు, బ్యాంకింగ్ నియంత్రణ సంస్థలు ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తాయని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఫైనాన్సియల్ మార్కెట్ విభాగం హెడ్ జౌలాన్ వివరణ ఇచ్చారు. బ్యాంకర్లు స్థిరంగా, క్రమ పద్దతిలో రియల్ ఎస్టేట్ రంగానికి రుణాలివ్వచ్చన్నారు.