Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లోని తమ సర్వర్లు హ్యాకింగ్‌కు గురైయ్యాయని తైవాన్‌కు చెందిన టెక్ దిగ్గజం ఏసర్ వెల్లడించింది. వినియోగదారులకు సంబంధించిన 60 జిబి డేటా హ్యాకర్ల చేతికి చిక్కిందని పేర్కొంది. సున్నితమైన ఖాతాల సమాచారంతోపాటు యూజర్ల వ్యక్తిగత సమాచారం, ఆర్థిక డేటా, కార్పొరేట్ కస్టమర్ డేటాలను తస్కరించినట్లు సమాచారం. భారత్‌లోని పది వేల మంది ఖాతాదారుల రికార్డులకు సంబంధించిన ఫైళ్లు, డేటాబేస్‌లతో కూడిన వీడియోను హ్యాకర్ గ్రూపు పోస్ట్ చేసింది. భారత్‌లో ఏసర్ రిటైలర్లు, పంపిణీదారులకు సంబంధించి మూడు వేల సెట్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్ కొట్టేసినట్లు హ్యాకర్లు తెలిపారు. వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్లు ఏసర్ తెలిపింది. ఈ విషయం గురుంచి దేశంలోని ఖాతాదారులందరిని అలర్ట్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఏడాదిలో కంపెనీ డేటాను దొంగలించడం ఇది రెండవ సారి.