Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యూ2 లాభాల్లో 18 శాతం వృద్థి
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2021 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 18శాతం వృద్థితో రూ.8,834 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే కాలం ఫలితాలో పోల్చితే రుణాల్లో బలమైన వృద్థి మెరుగైన ఫలితాలకు దోహదం చేసిందని ఆ బ్యాంక్ పేర్కొంది. నికర వడ్డీపై ఆదాయం 12.1 శాతం పెరిగి రూ.17,684.4 కోట్లుగా నమోదయ్యింది. అడ్వాన్సులు 15.5 శాతం పెరుగుదలతో రూ.11.98 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో రిటైల్ రంగానికి ఇచ్చిన అడ్వాన్సుల్లో 12.9 శాతం పెరుగుదల ఉంది. డిపాజిట్లు 14.4 శాతం వృద్థితో రూ.4.06 కోట్లుగా నమోదయ్యాయి. 2021 సెప్టెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1.35 శాతానికి తగ్గాయి. జూన్ ముగింపు నాటికి ఈ ఎన్పీఏలు 1.47 శాతంగా ఉన్నాయి. గడిచిన త్రైమాసికంలో మొండి బాకీల కోసం రూ.3,924.70 కోట్లు కేటాయించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో రూ.3,703.50 కోట్ల కేటాయింపులు చేసింది.