Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ఈ ఏడాది పండుగ సీజన్ ను పురస్కరించుకొని అందమైన వాల్ టెక్చ్సర్స్ కలెక్షన్ తానా బానా వాల్ టెక్చ్సర్స్ బై రాయల్ ప్లే ను ఏషియన్ పెయింట్స్ ను ప్రవేశపెట్టింది. భారతీయ హస్తకళల వారసత్వం నుంచి పొందిన స్ఫూర్తితో తానా బానా రూపుదిద్దుకుంది. ఇది వివిధ భావోద్వేగా లను, జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. మన పూర్వీకుల ఇళ్లలో ఉండే మంచాలు మొదలుకొని పూలు, పండ్లు పెట్టే వెదురు బుట్టల దాకా, అమ్మమ్మ, నాయనమ్మల వెలకట్టలేని ఇక్కత్ చీరలు మొదలుకొని పెళ్లికూతురు బీరువాలోని బాందేజ్ దుపట్టా దాకా తానా బానా మనకు కనిపిస్తూనే ఉంది. మన గోడలకు, జీవితాలకు వెలుగు తెచ్చేలా అది మళ్లీ సృష్టించబడింది.
తానా బానా అంటే ఒక విధమైన అల్లిక. దుస్తులపై కనిపించే దాన్ని అలా వ్యవహరిస్తారు. నేత, దాని నుంచి దారం, అక్కడి నుంచి నూలు, దాని నుంచి వస్త్రం వస్తాయి. వస్త్రాలు జీవనశైలిని ఏర్పరుస్తాయి.
తానా బానా కలెక్షన్ 8 అందమైన వాల్ టెక్చ్సర్స్ ను కలిగిఉంది. నైపుణ్యవంతులైన హస్తకళాకారుల నుం చి వారసత్వంగా వచ్చిన ఆ కళలకు ఒక అభినందనగా ఇవి రూపుదిద్దుకున్నాయి. ప్రాచీన సంప్రదాయా లు మొదలుకొని సమకాలీన ఇళ్ళ దాకా ‘తానా బానా’ ఫినిషెస్ ఎంతో విలక్షణంగా ఉంటాయి, దేశంలోని అన్ని ప్రాంతాలకు అవి ప్రాతినిథ్యం వహిస్తాయి. ఈ టెక్చ్సర్స్ పలు షేడ్ కాంబినేషన్స్ లో మెటాలిక్, నాన్ మెటాలిక్ రకాల్లో లభిస్తాయి. ఇవి మీ ఇంట్లో వివిధ చోట్లకు ఆధునికతతో కూడిన పర్సనల్ టచ్ ను అందిస్తాయి.
ప్రతి టెక్చ్సర్ కూడా తన భావనను ఒక స్థానిక కళ నుంచి పొందింది. అది ఒక రాష్ట్రంలో లేదా హస్తకళలకు చెందిన వర్గంలో ప్రఖ్యాతి పొందినదై ఉండవచ్చు. చార్ పై టెక్చ్సర్ అనేది ఉత్తరభారతదేశంలో విస్తృతంగా కనిపించే అల్లిక నుంచి స్ఫూర్తి పొందింది. పామ్ వీవ్ టెక్చ్సర్ అనేది భారతదేశ పశ్చిమ తీర రాష్ట్రాలైన గోవా, కేరళ అధికంగా కనిపించే జెయింట్ పామ్ చెట్ల ఆకుల నుంచి పొందిన స్ఫూర్తితో రూపుదిద్దుకుంది. ‘బందేజ్’ టెక్స్చర్ దాని పేరుకు తగినట్లుగా రాజస్థాన్, గుజరాత్ లకు చెందిన ప్రాచీన టై- డై రూపం నుంచి పొందిన స్ఫూర్తితో రూపుదిద్దుకుంది. ఫర్నీచర్, కళావస్తువుల తయారీకి సంబంధించి ఈశాన్య రాష్ట్రాల వెదురు హస్తకళల నుంచి పొందిన స్ఫూర్తితో బాస్కెట్ టెక్చ్సర్ వచ్చింది. మద్రాస్ చెక్స్ టెక్స్చర్ అనేది దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించే కళారూపానికి ప్రతీకగా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషాల నుంచి పొందిన స్ఫూర్తితో ఇక్కత్ టెక్చ్సర్ రూపుదిద్దుకుంది. పామ్ పామ్ టెక్చ్సర్ అనేది పూర్తిగా ఆనందానికి సంబంధించింది. లద్దాఖ్, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాం టి ఉత్తరాది రాష్ట్రాల నుంచి పొందిన స్ఫూర్తితో రూపుదిద్దుకుంది. శీతాకాలపు సాయంత్రం చలిలో వెచ్చద నాన్ని అందించే చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బిహార్, జార్ఖండ్ వంటి తూర్పు రాష్ట్రాల తయారు చేసే పట్టు నుంచి పొందిన స్ఫూర్తి తో తసర్ టెక్చ్సర్ రూపుదిద్దుకుంది. ఇది విలాసవంతమైంది.
ఈ కలెక్షన్ గురించి ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ అమిత్ సింగ్లే మాట్లాడుతూ, ‘‘రాయల్ ప్లే తానా బానా’ ను అందిస్తున్నందుకు మేమెంతో ఆనందిస్తున్నాం. నిజంగా ఇది భారతీయ హస్తకళలు, ఆ కళాకారుల నుంచి పొందిన స్ఫూర్తితో రూపుదిద్దుకున్న వాల్ టెక్చ్సర్స్ స్పెషల్ కలెక్షన్. ఆ కళలు మన గోడలపై సాక్షాత్కరించడం ఆ కళలతో ఒక పటిష్ఠ అనుబంధాన్ని ఏర్పరచడం మాత్రమే గాకుండా దేశీయం, సమకాలీనం అనే భావనలను కూడా అందిస్తుంది. ఈ కలెక్షన్ భారతీయ ఇళ్లకు అనువైంది, ఎన్నో జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది’’ అని అన్నారు.