Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT)తో కలిసి తెలంగాణ లైసెన్స్ సర్వీస్ ఏరియా (LSA) అక్టోబర్ 13, 2021న “ఇఎంఎఫ్ రేడియేషన్‌పై అవగాహన వెబినార్” నిర్వహించింది. సెప్టెంబరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 81,882 బేస్ ట్రాన్స్సీవర్ యూనిట్లు/మొబైల్ టవర్లు (BTS), తెలంగాణాలో 87,960 బేస్ ట్రాన్స్సీవర్ యూనిట్లు/మొబైల్ టవర్లు (BTS) ఉన్నాయి. ఏపీ ఎల్ఎస్ఎ హైదరాబాద్, విజయవాడ యూనిట్లలో సెప్టెంబరు 2021 నాటికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (TSP) నిబంధనలకు లోబడి పని చేస్తున్న అంశాన్ని గుర్తించేందుకుమొత్తం 85,626 బేస్ ట్రాన్స్సీవర్ యూనిట్లు/మొబైల్ టవర్ల వద్ద ఇఎంఎఫ్ పరీక్షలు నిర్వహించింది.
భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆజాది కా అమృత్ మహోత్సవ్‌గా నిర్వహించుకుంటోంది. ఈ స్మారక సందర్భాన్ని గుర్తు చేసుకునేందుకు, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని అలాగే సేవల నాణ్యతకు సంబంధించిన అత్యుత్తమమైన టెలికామ్ నెట్‌వర్క్‌ను నిర్ధారించడం ద్వారా సరికొత్త ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించేందుకు, టెలికమ్యూనికేషన్స్ శాఖ తన పబ్లిక్ అడ్వకేసీ కార్యక్రమంలో భాగంగా ఈ సదస్సును నిర్వహించింది. మొబైల్ టవర్ల ఆవశ్యకత గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయపడేందుకు, విశ్వసనీయమైన శాస్త్రీయ ఆధారాలను సమర్పించడం ద్వారా పౌరుల అకారణ భయాలను పరిష్కరించేందుకు,మొబైల్ టవర్ల నుంచి హానికరమైన రేడియేషన్ చుట్టూ ఉన్న సిద్ధాంతాలను నిరూపించే దిశలో ఈ సదస్సు కొనసాగింది. మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌కు సంబంధించిన ఆరోగ్య ప్రమాదాలకు సంబంధించిన అపోహలు, తప్పుడు సమాచారాన్ని తిరస్కరిస్తూ, పౌరుల్లో కలిగే ఆందోళనలను పరిష్కరించే దిశలో వైద్యులతో సహా టెలికాం విభాగానికి చెందిన సీనియర్ అధికారులతో కూడిన నిపుణుల బృందం అనేక అంశాలను చర్చించారు.
వెబినార్‌లో తెలంగాణ అదనపు కలెక్టర్లు, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ అధికారులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, సాధారణ ప్రజలు, కళాశాల అధ్యాపకులు &విద్యార్థులు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, మౌలిక సదుపాయాల ప్రదాతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఐటిఎస్-డిజిసి-కాంప్లియెన్స్ తెలంగాణ, ఎపి ఎల్ఎస్ఎ, టెలికమ్యూనికేష్స్ శాఖ అధికారి జి.వి.రమణారావు అతిథులకు స్వాగతం పలికారు. నిజాముల్ హక్-ఐటిఎస్, టెలికమ్యూనికేషన్ శాఖసలహాదారు, ఏపీ ఎల్ఎస్ఎ, హైదరాబాద్, అశోక్ కుమార్- ఐటిఎస్, సీనియర్ డిడిజి, టెలికమ్యూనికేషన్స్ శాఖ, ఎపిఎల్ఎస్ఎ, రాబర్ట్ రవి-ఐటిఎస్, డిడిజి-కాంప్లియెన్స్, విజయవాడ, ఎపి ఎల్ఎస్ఎ, టెలికమ్యూనికేషన్స్ శాఖ, హైదరాబాద్, డా.వివేక్ టాండన్, న్యూరోసర్జన్, న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రొఫెసర్ డా.కిరణ్ కుమార్ కుచి డీన్-ఆర్ &డి- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ –ఐఐటి హైదరాబాద్, తెలంగాణ సదస్సులో పాల్గొన్నారు. వెబినార్‌లో నిజాముల్ హక్-ఐటిఎస్, టెలికమ్యూనికేషన్ శాఖ సలహాదారు, ఏపీ ఎల్ఎస్ఎ, హైదరాబాద్ మాట్లాడుతూ, ‘‘టెలికమ్యూనికేషన్ అనేది పౌరుల సాధికారతకు కీలక పరికరం, ఒక దేశానికి సంబంధించిన సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఒక ప్రభావవంతమైన సాధనం. ఇది వేగవంతమైన అభివృద్ధి, అనేక ఆర్థిక రంగాలు, ఆధునికీకరణకు కీలకమైన మౌలిక సదుపాయంగా అభివృద్ధి చెందింది. వినియోగదారులకు సాధ్యమైనంతమేర గొప్ప టెలికమ్యూనికేషన్ సేవలను అందించేందుకు టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా మొబైల్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం అనివార్యమైన అంశం’’ అని స్పష్టం చేశారు. దీని గురించి నిజాముల్ హక్-ఐటిఎస్, టెలికమ్యూనికేషన్ శాఖ సలహాదారు, ఏపీ ఎల్ఎస్ఎ, హైదరాబాద్మరింతవివరిస్తూ,‘‘ఇఎంఎఫ్ రేడియేషన్లు, ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించి నిర్వహిస్తున్న వెబినార్ అపోహలను తొలగిస్తుంది, మొబైల్ టవర్లు, టెలికమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉన్న అడ్డకుంలు ఏవైనా ఉంటే వాటిని తొలగించి, సేవలను, అందరికీ చక్కని నెట్వర్క్ కవరేజ్ అందిస్తుంది’’ అని వివరించారు.
టెలికమ్యూనికేషన్ సేవల రూపురేఖలు, వాటాదారులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల గురించి ప్రస్థావిస్తూ అశోక్ కుమార్-ఐటిఎస్, సీనియరు డిడిజి, టెలికమ్యూనికేషన్ శాఖ, ఎపిఎల్ఎస్ఎ మాట్లాడుతూ, “మృదువైన కనెక్టివిటీకీ మొబైల్ టవర్లు అవసరం. సెల్యులార్ టవర్ల ద్వారా విడుదలయ్యే రేడియేషన్ గురించి కచ్చితమైన వాస్తవాలను పంచుకునేందుకు మనం నేడు ఇక్కడ కలుసుకున్నాము. వాస్తవం ఏమిటంటే ఇఎంఎఫ్ రేడియేషన్ మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. ఇఎంఎఫ్ సిగ్నల్స్‌పై మేము నిర్వహించిన సమగ్ర పరిశోధన ఆధారంగా, సెల్ టవర్ రేడియేషన్ ఎటువంటి ఆరోగ్య ప్రమాదాలను కలిగించదని మేము గుర్తించాము’’ అని తెలిపారు.
మన జీవితంలో మొబైల్ ఫోన్ల ఆవసరం మరియు దేశ అభివృద్ధి గురించి ఇఎంఎఫ్ రేడియేషన్‌పై తన ప్రజెంటేషన్ ఇచ్చిన రాబర్ట్ రవి ఐటిఎఫ్, డిడిజి, కాంప్లియెన్స్, విజయవాడ, ఎపిఎల్ఎస్ఎ, టెలికమ్యూనికేషన్స్ శాఖ హైదరాబాద్ విస్తృతంగా చర్చించారు. మొబైల్ టవర్ల నుంచి తక్కువ-స్థాయి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉద్గారాల గురించి చక్కని వివరణ ఇచ్చారు. తన ప్రజెంటేషన్‌లో భాగంగా మాట్లాడుతూ ‘‘ఇఎంఎఫ్ రేడియేషన్ అనేది మొబైల్ టవర్ యాంటెన్నాలు, మొబైల్ హ్యాండ్సెట్ల ద్వారా విడుదల చేయబడిన అయోనైజింగ్ లేని, తక్కువ శక్తి గల ఆర్ఎఫ్/విద్యుదయస్కాంత శక్తి. ప్రస్తుతం ఉన్న శాస్త్రీయ సమాచారం, అధ్యయనాలు, ప్రచురణల ప్రకారం, మొబైల్ టవర్ల నుంచి వెలువడే ఇఎంఎఫ్ రేడియేషన్‌తో ముప్పు అని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ టవర్ల (BTS) నుంచి వచ్చే రేడియేషన్‌ను టెలికమ్యూనికేషన్ శాఖనిర్దేశించిన సురక్షిత పరిమితుల కన్నా తక్కువగా ఉండేలా చూసుకుంటారు. సంబంధిత టెలికమ్యూనికేషన్ శాఖకు స్వీయ ధృవీకరణ పత్రాన్ని సమర్పిస్తుంది. ఇంకా, మొబైల్ టవర్ల నుంచి ఇఎంఎఫ్ ఉద్గారాలు అంతర్జాతీయ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (ICNIRP), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన సురక్షిత పరిమితుల కన్నా తక్కువగా ఉన్నాయి. అవి ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు కారణమవుతాయని నమ్మదగిన శాస్త్రీయ ఆధారాలు లేవు’’ అని వివరించారు.
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్, న్యూరో సర్జన్ డా.వివేక్ టాండన్ మాట్లాడుతూ, ‘‘ఈ రేడియేషన్లు మానవ ఆరోగ్యంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపించవని శాస్త్రీయ పరిశోధన నిరూపించింది. ఈ రోజుల్లో మొబైల్ టవర్ ఇఎంఎఫ్ రేడియేషన్‌ను పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని పౌరులు అర్థం చేసుకోవాలి. విశ్వసనీయ మూలాల నుంచి రుజువులు కూడా ఇఎంఎఫ్ రేడియేషన్ల వల్ల ఆరోగ్య ప్రమాదాల వస్తాయన్న అంశాలను ఈ ఆధారాలు తోసిపుచ్చాయి’’ అని స్పష్టం చేశారు.
రేడియేషన్‌పై సమగ్ర వివరాలను అందిస్తూ, ప్రొఫెసర్ డా.కిరణ్ కుమార్ కుచి డీన్- ఆర్ & డి- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ –ఐఐటి హైదరాబాద్, తెలంగాణ మాట్లాడుతూ, “మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ అంశంపై భారతదేశంలోని వివిధ హైకోర్టుల తీర్పులు నిరూపించడానికి కచ్చితమైన డేటా లేదని పేర్కొన్నాయి. మొబైల్ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ ఏ విధంగానైనా పౌరుల ఆరోగ్యానికి హానికరం లేదా ప్రమాదకరం కాదు’’ అని వివరించారు. మొబైల్ టవర్ ఇఎంఎఫ్ రేడియేషన్ కచ్చితంగా పర్యవేక్షించబడుతోందని, విశ్వసనీయ మూలాల నుంచి రుజువులు ఇఎంఎఫ్ రేడియేషన్ల నుంచి సంభవించే ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చాయని పౌరులు ఈరోజు అర్థం చేసుకోవడం చాలా అవసరం. భారతదేశంలోని ఎనిమిది హైకోర్టులు కూడా ఈ అభిప్రాయాన్ని సమర్థించాయి. అటువంటి అవాస్తవమైన అపోహలు, భయాలన్నింటినీ తొలగించేందుకు ప్రయత్నించే తీర్పులను అందించాయి. ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీ వృద్ధిలో ఇటువంటి తప్పుదారి పట్టించే కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొంటోంది.
అందువల్ల, ఇఎంఎఫ్ ఉద్గారాలతో ఆరోగ్య ప్రమాదాల గురించి తెలంగాణాలోని ఒక వర్గం ప్రజలలో ఉన్న అపోహను పరిగణనలోకి తీసుకోకూడదు. టవర్ల ఏర్పాటుకు అనుమతించాలి. అవసరం ఉన్న చోట్ల వాటి ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఐసిఎన్ఐఆర్పి (ICNIRP)సూచించిన, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)సిఫార్సు చేసిన దాని కన్నా 10 రెట్లు కఠినమైన నిబంధనలను భారత ప్రభుత్వం అనుసరిస్తుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లందరూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు కట్టుబడి ఉన్నారో లేదో నిర్ధారించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయి. ఇఎంఎఫ్ ఎక్స్పోజర్ ప్రమాదం నుంచి ప్రియమైన పౌరులను రక్షించేందుకు రూపొందించబడిన మార్గదర్శకాల సమ్మతిని సులభతరం చేయడానికి టెలికమ్యూనికేషన్స్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉంది. మొబైల్ టవర్ల నుంచి వారి ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని ప్రజలకు తెలియజేయాలి, హామీ ఇవ్వాలి. ప్రశ్నోత్తరాల సెషన్లో, ప్యానలిస్టులు మొబైల్ కనెక్టివిటీ అనేది సమాజంలోని ప్రతి విభాగానికి అవసరమైన సమయం అని హైలైట్ చేసారు. అలాగే ‘డిజిటల్ ఇండియా’ కోసం ప్రభుత్వ దృష్టిలో ఇది ఒక అంతర్భాగం. ప్యానెల్ చర్చల్లో ఎపిఎల్ఎస్ఎ, హైదరాబాద్ డైరెక్టర్ (కంప్లైయన్స్) తరుపున ఎం.అరవింద్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.