Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో స్ధిరంగా పెరుగుతున్న ధరలు ఇప్పుడు నిజామ్ల నగరాన్ని భారతదేశంలో ఎంఎంఆర్ తరువాత అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా నిలిపింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరంగా చూసినట్లయితే, డిమాండ్, సరఫరా కోణంలో పూర్తి స్థాయిలో కోలుకోవడం కనిపిస్తుంది. ప్రాప్‌టైగర్ డాట్ కామ్ బిజినెస్ హెడ్ రాజన్ సూద్ మాట్లాడుతూ ‘‘ దాదాపు 10 సంవత్సరాల కాలంలో అతి తక్కువగా గృహ ఋణ వడ్డీ రేట్లు ఉండటంతో పాటుగా స్టాంప్ డ్యూటీలను తగ్గించడం, సర్కిల్ ధరలలో సవరణలు వంటి వాటి ద్వారా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా ఈ పండుగ సీజన్లో అందుబాటు ధరలలోని గృహాల పరంగా అత్యధిక వృద్ధి నమోదయింది. ప్రస్తుత త్రైమాసంలో దేశంలోని టాప్ 8 నగరాలలో గృహ మార్కెట్లలో స్థిరత్వం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము. అత్యంత కీలకమైన ఇన్పుట్ ధరలు గణనీయంగా పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ, కొనుగోలుదారులకు తాత్కాలికంగా రాయితీలను అందిస్తున్నారు, లేదంటే ఈ నగరాలలో ధరలు విపరీతంగా పెరుగుతాయి’’ అని అన్నారు.
‘‘ పునరుద్ధరణ ప్రక్రియకు పలు రాష్ట్రాలు తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి. నూతన గృహ కొనుగోలుదారులకు నూతన ప్రోత్సాహకాలను ప్రకటించడం లేదా స్టాంప్ డ్యూటీ లేదా సర్కిల్ రేట్ రద్దును కొనసాగించడం లేదా ప్రారంభించడం చేస్తున్నాయి’’ అని సూద్ జోడించారు. ప్రోపర్టీ బ్రోకరేజీ సంస్ధ ప్రాప్ టైగర్ డాట్ కామ్ ప్రతి మూడు నెలలకోమారు భారతదేశంలో అతి ప్రధానమైన రెసిడెన్షియల్ మార్కెట్లలో చేసే విశ్లేషణ, రియల్ ఇన్సైట్ (రెసిడెన్షియల్) – జూలై–సెప్టెంబర్ (క్యు3) 2021 వెల్లడించే దాని ప్రకారం, హైదరాబాద్‌లో సరాసరి ఆస్తి విలువ వార్షికంగా 3% వృద్ధిని జూలై–సెప్టెంబర్ 2021 (క్యు 3 2021)లో చూసింది. తద్వారా చదరపు అడుగు విలువ 5,751 రూపాయలుగా నిలిచింది. ఈ నివేదిక వెల్లడించిన దాని ప్రకారం, సరాసరి ధరలు చూసినట్లయితే, వార్షిక వృద్ధి పరంగా హైదరాబాద్ ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రోపర్టీ మార్కెట్‌గా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) తరువాత నిలిచింది. ఎంఎంఆర్‌లో సరాసరి ధరలు 9,670 రూపాయలుగా ఓ చదరపు అడుగుకు నిలిచాయి.
ధరల వృద్ధి: నగరాల వారీగా బ్రేకప్
హైదరాబాద్‌లో ఆరోగ్యవంతమైన ఇన్వెంటరీ ప్రొఫైల్‌ను నిర్వహించేందుకు వృద్ధి చెందిన డిమాండ్ తోడ్పడింది. ధరల పెరుగుదల కొనసాగుతున్నప్పటికీ, హైదరాబాద్‌లో ఆస్తుల కోసం డిమాండ్ కొనసాగుతుంది. ఇది కేవలం అమ్మకాల గణాంకాల పరంగా మాత్రమే కాదు, నగరపు ఇన్వెంటరీ ప్రొఫైల్ పరంగా కూడా వృద్ధి చెందుతుంది. జూలై–సెప్టెంబర్ 2021 త్రైమాసంలో, మొత్తంమ్మీద 7,812 యూనిట్లు నగర వ్యాప్తంగా అమ్ముడయ్యాయి. తద్వారా 222% వృద్ధి క్వార్టర్ ఆన్ క్వార్టర్‌పై కనిపించడంతో పాటుగా ఇయర్ ఆన్ ఇయర్ 140% డిమాండ్ కనిపించింది. ఈ త్రైమాసంలో బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ మొదలైన చోట్ల అమ్మకాలు ఎక్కువగా కనిపించాయి.
హైదరాబాద్‌లో ప్రోపర్టీల పరంగా డిమాండ్ గణనీయంగా పెరిగింది. నగరంలో మొత్తంమ్మీద 50,103 యూనిట్లు అమ్ముడుకాకుండా ఉన్నప్పటికీ అతి తక్కువగా 25 నెలలు మాత్రమే ఇన్వెంటరీ ఓవర్‌హ్యాంగ్ కనిపిస్తుంది. నిజానికి కోల్‌కతాలో అతి తక్కువగా ఇన్వెంటరీ స్టాక్ ఉన్నప్పటికీ, విక్రయించడానికి అక్కడ చాలా అధిక సమయం తీసుకుంటుంది.