Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ తన కొత్త మోడల్ టాటా పంచ్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. టాటా తీసుకొచ్చిన అతి చిన్న ఎస్యువి కావడం విశేషం. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్‌తోపాటు ఏడు రంగుల్లో ఈ కారును ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూం వద్ద దీని ధరల శ్రేణిని రూ.5.49 లక్షల నుంచి రూ.9.09 లక్షలుగా నిర్ణయించింది. భద్రత విషయంలో ఈ కారుకు 5 స్టార్ రేటింగ్ ఉంది. రెండు ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఫాగ్ ల్యాంప్, పారామెట్రిక్ అలారం వ్యవస్థ, రివర్స్ పార్కింగ్ కెమెరా, డ్రైవర్, కో డ్రైవర్ సీట్‌బెల్ట్ రిమైండర్లు, టైర్ పంక్చర్ రిపేర్ కిట్‌లాంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో 7 అంగుళాల హార్మన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేలను సపోర్ట్ చేస్తుంది.