Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో నూతన రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. సోమవారం సెషన్లో సెన్సెక్స్ 460 పాయింట్లు పెరిగి ఏకంగా 61,756కు చేరింది. ఇంట్రాడేలో ఏకంగా 61,963ను తాకింది. ఇదే బాటలో ఎన్ఎస్ఇ నిఫ్టీ 138 పాయింట్లు రాణించి 18,477 వద్ద ముగిసింది. గడిచిన ఏడు సెషన్లలో ఈ సూచీ 831 పాయింట్లు లేదా 4.7 శాతం లాభపడింది. సెన్సెక్స్-30లో ఇన్ఫోసిస్ అత్యధికంగా 4.5 శాతం పెరిగి రూ.1,792 వద్ద ముగిసింది. టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, మారుతి సూచీలు అధికంగా లాభాపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు హెచ్‌సిఎల్ టెక్నలాజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా సూచీలు 2 శాతం మేర నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో సూచీలు విలువ కోల్పోయాయి. సెన్సెక్స్‌లో 1,830 సూచీలు లాభాల్లో ముగియగా, 1,620 సూచీలు ఒత్తిడికి గురైయ్యాయి.