Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ మంగళవారం కొత్తగా ఎల్ఐసి ఎంఎఫ్ బ్యాలెన్సడ్ అడ్వాంటేజ్ ఫండ్ (ఎల్ఐసీ ఎంఎఫ్ బీఏఎఫ్)ను ఆవిష్కరించింది. ఇది ఓపెన్ ఎండెడ్ డైనమిక్ ఎస్సెట్ కేటాయింపు ఫండ్ అని వెల్లడించింది. ఈ నిధులను ఈక్విటీ, రుణ, నగదు మార్కెట్, వాల్యూయేషన్, ఎర్నింగ్ డ్రైవర్లు వంటి పలు అంశాలను వినియోగించి పెట్టుబడిగా పెట్టనుంది. ''బాండ్ దిగుబడులు, ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి, రిస్క్ అపెటైట్ గ్రహించడానికి ఓ అవకాశాన్ని సూచిస్తాయి. ఈ ఫండ్ కేవలం మార్కెట్ ర్యాలీలో మదుపరులు పాల్గొనేందుకు సహాయపడటం మాత్రమే కాదు. మరీ ముఖ్యంగా డౌన్వార్డ్ ప్రమాదాన్ని సైతం ఇది తగ్గించడం దీని లక్ష్యం. ఎలాంటి పెట్టుబడి వ్యూహానికి అయినా ఇది అత్యంత కీలకమైన అంశం. మదుపరులు ఈక్విటీ పన్ను ప్రయోజనాలను పొందేందుకు తోడ్పడుతూ స్థూల ఈక్విటీ కేటాయింపు 65 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉండటానికి ఈ ఫండ్ ప్రయత్నిస్తుంది.' అని ఆ సంస్థ సిఇఒ దినేష్ పంగ్తే పేర్కొన్నారు. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ)ను 2021 అక్టోబర్ 20న తెరించి నవంబర్ 30తో మూసివేస్తారు.