Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత బ్యాంక్‌ల పరపతిని పెంచుతూ గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్‌ల పరపతిని 'ప్రతికూలత' నుంచి 'స్థిరత్వం'కు మార్చి నట్లు మంగళవారం వెల్లడించింది. కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి బ్యాంక్‌లు బయటపడుతున్నాయని పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2018-19లో బ్యాంక్‌ల నిరర్థక ఆస్తులు 8.5 శాతంగా ఉండగా.. 2020-21లో 7.1 శాతానికి తగ్గాయని పేర్కొంది. రుణాల వ్యయం తగ్గడంతో పాటుగా ఆస్తుల విలువ పెరిగిందని పేర్కొంది. బ్యాంక్‌ల పరపతి పెంచడంతో ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మార్కెట్లో నిధులు సమీకరించుకోవడానికి అవకాశాలు పెరగనున్నాయి. రుణ వ్యయాలు తగ్గడంతో లాభదాయకత పెరగనుంది.