Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో సిల్క్ రైతులు, వ్యాపారుల, రిటైలర్లకు మార్కెట్ ప్రాంగణంగా సేవల నందిస్తున్న తొలి సిల్క్టెక్ స్టార్టప్ రేషా మండి నిధులు సమీకరించినట్లు తెలిపింది. అంతర్జాతీయ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇతర ఇన్వెస్టర్ల నేతత్వంలో 30 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.225 కోట్లు) తమ మొట్టమొదటి సిరీస్ ఏ ఫండింగ్‌ను పొందినట్లు వెల్లడించింది. ఈక్విటీ ఫండింగ్‌లో నూతన ఇన్వెస్టర్లు అయినటువంటి 9 యునికార్న్స్, వెంచర్ క్యాటలిస్ట్స్, నెక్సస్ నుంచి సందీప్ సింఘాల్, ఇండియా మార్ట్ ఫౌండర్ బ్రిజేష్ అగర్వాల్ , ఓమ్నీవోర్ ఉన్నాయని తెలిపింది. డెబ్ట్ ఇన్వెస్టర్లలో నార్త్రన్ ఆర్క్, అల్టేరియా, ఇన్నోవెన్, స్టైడ్ర్ వెంచర్స్ ఉన్నాయని పేర్కొంది.