Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్ మంగళవారం తమ వీడియో ప్లాట్‌ఫామ్ యాజ్ ఏ సర్వీస్ (సీపాస్) -ఎయిర్టెల్ ఐక్యు వీడియోను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. దీన్ని తమ సంస్థ అంతర్గత ఇంజినీరింగ్ బందాలు అభివద్ధి చేశాయని తెలిపింది. వ్యాపార సంస్థలు ప్రపంచశ్రేణి వీడియో స్ట్రీమింగ్ ఉత్పత్తులను భారీ, చిన్న స్క్రీన్ల కోసం మౌలిక వసతులు, సాంకేతికతలో కనీస పెట్టుబడితో నిర్మించేందుకు అనుమతిస్తుందని తెలిపింది. ఇది యాప్ డెవలప్మెంట్, కంటెంట్ హోస్టింగ్, క్యూరేషన్, లైఫ్‌సైకిల్ మేనేజ్మెంట్ నుంచి సెర్చ్, డిస్కవరీ, ఎనలిటిక్స్, ప్రకటనలు, చందా, లావాదేవీలు కలిగి ఉంటుందని పేర్కొంది.