Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: భారతదేశపు అతి పెద్ద మరియు బాలలకు ప్రియమైన కంటెంట్ ప్లాట్ఫారం- వూట్ కిడ్స్ ఇప్పుడు అనియమింత మనోరంజన ద్వారా తన జూనియర్ ప్రేక్షకులను రంజించేందుకు సిద్ధమైంది. భారతదేశంలో అత్యంత ప్రీతిపాత్రమైన పాత్రలు, మనోరంజన అలాగే బాలలకు లెర్నింగ్‌తో కలిసి ఉన్న వినోదాన్ని తీసుకు వచ్చే ఒన్-స్టాప్ కేంద్రంగా నిలిచే దిశలో తన కంటెంట్ కలెక్షన్‌ను బలోపేతం చేసుకుంటున్న వూట్ కిడ్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన అనిమి ఫ్రాంఛాయిసీ- పోకిమ్యాన్ను భారతదేశంలో వీక్షణకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. విజయవంతమైన పోకిమ్యాన్ 25 ఏళ్ల ప్రజాదరణను వేడుక చేసుకుంటున్న వూట్ కిడ్స్ ఇప్పుడు భారతదేశంలో ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారాల కన్నా ఎక్కువ పోకిమ్యాన్ వినోదానికి ప్రాధాన్యత ఇస్తున్నగో టూ ప్లాట్ఫారం కాగా, 21 చలన చిత్రాలు మరియు 10,000కు పైచిలుకు నిమిషాల పోకిమ్యాన్ అనిమి సిరీస్ కంటెంట్‌ను కలిగి ఉంది.
పోకిమ్యాన్ తన విస్తరణను వీడియో గేమింగ్ విభాగంలో మాత్రమే కాకుండా, ఇటీవల పోకిమ్యాన్ యునైట్ అనే మోబా గేమ్న నింటెడో స్విచ్, ఆండ్రాయిడ్ మరియు ఐఓఓస్ ప్లాట్‌ఫారాల్లో ఆడేలా ఇటీవల విడుదల చేసింది. ఈ చలన చిత్రాలు మరియు ఐకానిక్ పాత్రల శ్రేణి ప్రపంచ వ్యాప్తంగా అపార స్థాయిలో అభిమానులను దక్కించుకుంది. భారతదేశంలో మొదటి సారిగా వూట్ కిడ్స్ ప్రసారం చేస్తున్న ఈ 21 పోకిమ్యాన్ చలన చిత్రాలు అనిమి ఫ్రాంఛాయిసీను తమ అభిమానులకు చేరువు చేస్తున్న మహోన్నత కంటెంట్ ఇనీషియేటివ్‌గా ఉంది. వూట్ కిడ్స్ భారతదేశంలో తన అభిమానులను మమేకం చేసే పోకిమ్యాన్ అనుభవాన్ని పోకిమ్యాన్ 21 గ్లోబల్ బ్లాక్‌బస్టర్ చలన చిత్రాలు మరియు విస్తృత కంటెంట్ లైబ్రరీ ద్వారా అందిస్తుంది. బాలల విభాగంలో ఈ వినూత్న తరహా కంటెంట్ ప్రయత్నం ‘చునో వూట్ కిడ్స్ చునో పోకిమ్యాన్’ చుట్టూ విస్తరించి ఉంది. ప్రతి పోకిమ్యాన్ అభిమాని వూట్ కిడ్స్ను తనకు అత్యంత ప్రియమైన డిజిటల్ గమ్యస్థానంగా ఎంపిక చేసుకుంటుండగా, వారిదే స్వంత వివేచనతో ఆనందిస్తారు అనే విశ్వాసాన్ని కలిగి ఉంది.
ఈ ప్రయత్నం గురించి ఎస్విఒడి (వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్) మరియు ఇంటర్నేషనల్ బిజినెస్ అట్ వూట్ 18 అధికారి ఫర్జాద్ పాలియా మాట్లాడుతూ, ‘‘వూట్ కిడ్స్‌లో మే మా యువ ప్రేక్షకులకు 100% సురక్షిత పరిసరాల్లో వారికి అత్యంత ఇష్టమైన పాత్రలను ఆనందించేందుకు మరియు నేర్చుకునేందుకు వినోదాన్ని సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. ఈ మన ప్రయత్నం గత ఏడాది కిడ్స్ ఫన్ లెర్న్ విభాగం అపారమైన డిమాండ్ ప్రగతిని చూడడంతో గమనార్హమైన ఉత్తేజాన్ని పొందాము. విస్తృతమైన పోకిమ్యాన్ స్లేట్‌ను మా కంటెంట్ కలెక్షన్‌కు చేర్చడం ద్వారా మా ప్రేక్షకుల సంఖ్యను మరింత విస్తరించుకునేందుకు మరియు ఈ విభాగంలో లీడర్‌గా నిలవడాన్ని కొనసాగిస్తాము’’ అని వివరించారు.
ఈ ఇనీషియేటివ్ గురించి వూట్ కిడ్స్ హెడ్ ఆఫ్ కంటెంట్ అశుతోష్ పరేఖ్ మాట్లాడుతూ ‘‘వూట్ కిడ్స్‌లో మేము గ్లోబల్ మరియు స్థానిక పాత్రలతో కూడిన శక్తియుతమైన పాత్రలను రూపొందించడాన్ని కొనసాగిస్తున్నాము. మా ప్లాట్ఫారం ద్వారా చేపట్టే ప్రతి ప్రయత్నంలోనూ వినియోగదారులను మా హృదయంలో ఉంచుకుని చేస్తుండగా, ఇది భారతదేశంలో పోకిమ్యాన్కు ఉన్న అభిమానులు బాలలు, బాలల్లా ఉండేవారిలో మరింత ఎక్కువైంది. ఈ ప్రజాదరణ పొందిన అనిమి ఫ్రాంఛాయిసీ పలు విస్తరణలతో నేటి డిజిటల్ నేటివ్లను తన అతిశయోక్తి కథ మరియు అత్యుత్తమంగా రూపొందించిన పాత్రలు వారి ఏకీకరించిన హాస్యంతో సాహస కృత్యాలు అత్యంత ఆదరణను దక్కించుకోనున్నాయి. ఈ బృహత్ పోకిమ్యాన్ బ్లిట్స్ 21 చలనచిత్రాలు మరియు 10,000 నిమిషాల పోకిమ్యాన్ అనిమి సిరీస్ ద్వారా వూట్ కిడ్స్ను దేశంలో అత్యంత పెద్ద డిజిటల్ హోమ్‌గా మార్చనుంది. కనుక, మేము వూట్ కిడ్స్‌లో ‘గోట్టా క్యాచ్ దెమ్ ఆల్’ అని భారీగా చెబుతున్నాము’’ అని అన్నారు.
‘‘వూట్ కిడ్స్‌తో మా భాగస్వామ్యానికి మరియు చలనచిత్రాల నుంచి సీజన్ల వరకు భారతదేశంలో పోకిమ్యాన్ అభిమానులను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఉత్సుకతతో ఉన్నాము. ఇది పోకిమ్యాన్ అభిమానులకు డిజిటల్ విధానంలో అందుబాటులో ఉండడం అమూల్యమైన సంపద కానుంది మరియు ఇది అభిమానులతో లోతైన బాంధవ్యాన్ని నిర్మించేందుకు సహకరిస్తుంది’’ అని భారతదేశంలో పోకిమ్యాన్కు మాస్టర్ లైసెన్సింగ్ ఏజెన్సీ డ్రీమ్ థియేటర్ వ్యవస్థాపకుడు మరియు సిఈఓ జిగ్గి జార్జ్ తెలిపారు.
‘‘వూట్ కిడ్స్‌లో మా భాగస్వాముల మద్ధతుతో మేము చివరిగా భారతదేశంలో 1-21 చలన చిత్రలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాము. భారతదేశంలో మా అభిమానులకు పోకిమ్యాన్ వినోదం మరియు ఉత్సాహాన్ని పంచుకునేందుకు థ్రిల్ అవుతున్నాము. వూట్ కిడ్స్ మరియు టిపిసి ఇతర వినోదమయమైన ఆఫర్లను అందిస్తున్నాము. భారతదేశంలో ఎక్కువ మంది అభిమానులు దీనిలో భాగమవుతారన్న భరోసా మాకు ఉంది’’ అని పోకిమ్యాన్ కంపెనీ కార్పొరేట్ ఆఫీసర్ సుసుము ఫుకునగ తెలిపారు.
వూట్ కిడ్స్ నేడు అత్యంత పెద్ద మరియు విస్తృత శ్రేణిలో మల్టీ ఫార్మాట్ కిడ్స్ యాప్‌గా గుర్తింపు దక్కించుకోగా, మనోరంజన మరియు బాలలను వారి ‘మేడ్ ఫర్ కిడ్స్’ కార్యసూచికను మనసు రంజించే మరియు క్రియాశీలకం చేసే ఉద్దేశాన్ని కలిగి ఉంది. పవర్ హౌస్ ప్లాట్‌ఫారంగా వూట్స్ కిడ్స్ శక్తియుతమైన కథలు మరియు పాత్రల్లో పెట్టుబడులను కొనసాగిస్తూ, విస్తరించిన మరియు లీనమయ్యేలా చేసే కంటెంట్ అనుభవాన్ని భారతదేశంలో బాలలకు అందిస్తోంది.