Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తాజా ధోరణులకు నిలయమైన భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్ కేంద్రం, లైఫ్‌స్టైల్ తమ పూర్తి సరికొత్త పండుగ కలెక్షన్‌ను దీపావళి కోసం విడుదల చేసింది. ఈ కలెక్షన్లో వినూత్న అంశం ఏమిటంటే, అత్యున్నత పండుగ వస్త్రాలను ఇది వెంట తీసుకురావడంతో పాటుగా షాపర్లకు మరింత సంతోషకరమైన దీపావళిని తీసుకువచ్చేలా పూర్తి అందుబాటు ధరలలో ఇవి ఉండటం. ఈ కలెక్షన్‌తో పాటుగా అత్యద్భుతమైన చిత్రంను దిల్ సే దివాలీ శీర్షికన విడుదల చేశారు. ఇది బ్రాండ్ యొక్క విజయవంతమైన ప్రచారానికి కొనసాగింపు. మరుపురాని గీతంతో మధురక్షణాలను జ్ఞప్తికి తీసుకువచ్చేలా ఈ చిత్రం తీర్చిదిద్దారు.
ఈ చిత్రంలో ప్రదర్శించిన ఆకర్షణీయమైన, రంగు రంగుల కలెక్షన్ చూడటానికి ఆహ్లాదకరంగా ఉండటంతో పాటుగా అత్యద్భుతమైన ధరల వద్ద లభిస్తాయి. మహిళల కోసం కుర్తాలు కేవలం 499 రూపాయలలో లభిస్తే, పురుషుల కుర్తాలు 799 రూపాయల నుంచి లభిస్తాయి. అలాగే మహిళల పాదరక్షలు 399 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తే పురుషుల పాదరక్షలు 599 రూపాయలకు, హ్యాండ్‌బ్యాగ్‌లు 999రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి. ఈ చిత్రంతో పాటుగా కలెక్షన్ గురించి రోహిణి హల్డియా, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ , లైఫ్‌స్టైల్ మాట్లాడుతూ ‘‘ దిల్ సే దివాలీ చిత్రం, వినూత్న క్షణాలను వేడుక చేసే రీతిలో ఉంటుంది. మా నూతన పండుగ కలెక్షన్‌ను దీపావళి తీసుకువచ్చే శుభాలను మనసులో ఉంచుకుని తీర్చిదిద్దాం. ఈ పండుగ కలెక్షన్ మరింత ఆకర్షణీయంగా మారే అంశం ఏమిటంటే, అత్యంత అందుబాటు ధరలలో ఇది లభిస్తుండటం. వినియోగదారుల ఆలోచనా ధోరణి ఎలాగున్నా, వారు వైవిధ్యంగా నిలిచేందుకు తగిన అవకాశాలు కల్పిస్తామనే భరోసా అందిస్తున్నాం’’అని అన్నారు.
ఈ చిత్రం గురించి ప్రియా శివకుమార్, నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్, వండర్మన్ థాంప్సన్ ఇండియా మాట్లాడుతూ ‘‘దిల్ సే దివాలీ మూడవ సంవత్సరం మరలా తిరిగి వచ్చింది. ఈ సారి పండుగ సీజన్ స్ఫూర్తిని వాస్తవంగా ఒడిసిపట్టే ప్రయత్నం చేశాం. ఈ సీజన్లో అందంగా డ్రెస్సింగ్ చేసుకోవడంలోని ఆనందాన్ని లైఫ్‌స్టైల్ తీసుకువస్తుంది..’’అని అన్నారు.