Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆన్లైన్లో జరుగనున్న ఖజానా గజల్స్ పండుగలో గజల్ మెస్ట్రో పంకజ్ ఉదాస్, అనూప్ జలోటా, తలత్ అజీజ్, కవితా సేఠ్, రేఖా భరద్వాజ్, ఒస్మార్ మిర్, సుదీప్ బెనర్జీ, సంజీవని భెలాండీ వంటి వారు క్యాన్సర్, తలసేమియా రోగుల కోసం నిధుల సమీకరణకు తోడ్పడనున్నారు. మహోన్నత కారణం కోసం సంగీత ప్రేమికులు విరివిగా విరాళాలను అందించాల్సిందిగా కోరుతున్న క్యాన్సర్ పేషంట్స్ ఎయిడ్ అసోసియేషన్ (సీపీఏఏ) మరియు పేరెంట్స్ అసోసియేషన్ తలసేమిక్ యూనిట్ ట్రస్ట్ (పీఏటీయుటీ)
ఈ ఉచిత సంగీత సమారోహాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షకులు హంగామా పై వీక్షించవచ్చు
కోవిడ్ –19 మహమ్మారి, సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాలు సహా అన్ని రంగాలపై అప్రకటిత నిషేదాన్ని విధించింది. సంగీత పరిశ్రమ అందుకు మినహాయింపేమీ కాదు. నిబంధనలను అనుసరిస్తూ ఈ షో కొనసాగాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ క్రమంలోనే క్యాన్సర్ పేషంట్స్ ఎయిడ్ అసోసియేషన్ (సీపీఏఏ) మరియు ద పేరెంట్స్ అసొసియేషన్ తలసేమియా యూనిట్ ట్రస్ట్ (పీఏటీయుటీ) తమ వార్షిక ఫండ్ రైజర్ కార్యక్రమం ఖజానా – ఫెస్టివల్స్ ఆఫ్ గజల్స్‌ను వినూత్న మార్గంలో నిర్వహిస్తుంది. గజల్స్ ప్రేమికుల కోసం ఈ కార్యక్రమం అక్టోబర్ 22 – 23 తేదీలలో సాయంత్రం 7.30 గంటల కు హంగామా, పంకజ్ ఉదాస్ యూట్యూబ్ మరియుఫేస్బుక్ ఛానెల్స్‌పై ప్రత్యక్ష ప్రసారం కానుంది.
వరుసగా 20వ సంవత్సరం జరుగుతున్న ఈ ఖజానా ఫెస్టివల్లో అనూప్ జలోటా, తలత్ అజీజ్ లాంటి ఉద్ధండులతో పాటుగా యువ కళాకారులు స్నేహ అస్టుంకర్, ఆర్చనా కామత్ హెగ్డేకర్ కూడా పాల్గొననున్నారు. గజల్ కళాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించడంతో పాటుగా తలసేమియా చిన్నారులు, క్యాన్సర్ రోగుల కోసం నిధుల సమీకరణనూ చేయనున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా వర్ట్యువల్ గా ఈ కాన్సర్ట్ చేయబోతున్నామని పద్మశ్రీ పంకజ్ ఉదాస్ వెల్లడిస్తూ 20వ సంవత్సరం నిర్వహిస్తున్న కార్యక్రమం అపూర్వ విజయం సాధిస్తుందనే విశ్వాసంతో ఉన్నామన్నారు.