Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వ్యవసాయ ఉత్పత్తులు, పంట పరిష్కారాల కంపెనీ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ అంతర్జాతీయ కంపెనీ బేయర్తో కీలక ఒప్పందం కుదుర్చు కుంది. బేయర్ తన భారత్లోని పత్తి, ఆవాలు, చిరు ధాన్యాలు, జొన్నలు తదితర విత్తనాల వ్యాపారాన్ని క్రిస్టల్కు అప్పగించింది. 2021 డిసెంబర్ నాటికి ఈ లావాదేవీ పూర్తి కానుంది. అయితే ఇందుకోసం బేయర్కు క్రిస్టల్ ఎంత మొత్తం చెల్లించేది వెల్లడించలేదు. ఈ నిర్ణయం వల్ల భారత రైతులకు, వ్యవసాయాభివృద్థికి దోహదం చేయనుందని క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఛైర్మన్ ఎన్కె అగర్వాల్ పేర్కొన్నారు. ఈ స్వాధీనంతో క్రిస్టల్ భారత విత్తన రంగంలో అత్యంత కీలక శక్తిగా మారనుందని అంచనా. లావాదేవీ పూర్తి అయ్యే వరకు ఈ వ్యాపారం బేయర్ క్రాప్ చేతిలోనే కొనసాగనుంది.