Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరఫరా చెయిన్‌లో అనిశ్చితి : ఐఎంఎఫ్ వెల్లడి
న్యూయార్క్ : ప్రస్తుత ఏడాదిలో ఆసియా వృద్థి రేటు అంచనాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) కోత పెట్టింది. కరోనా సంక్షోభంతో సరఫరా చెయిన్‌లో అనిశ్చితి చోటు చేసుకుందని, ద్రవ్యోల్బణం భయాలు నెలకొన్నాయని పేర్కొంది. ''ప్రస్తుత ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ 8.0 శాతం పెరుగొచ్చు. 2022లో 5.6 శాతంగా ఉండొచ్చు. రికవరీలో ఆటుపోట్లు ఉండొచ్చు'' అని ఈ రిపోర్ట్ పేర్కొంది. కాగా ఆసియా వృద్థి రేటు 6.5 శాతానికి తగ్గొచ్చని అంచనా వేసింది. ఇంతక్రితం అంచనాతో పోల్చితే ఇది 1.1 శాతం తక్కువ, డెల్టా వేరియంట్ కేసులు పెరగడం, వినిమయం, ఫ్యాక్టరీ ఉత్పత్తి తగ్గడంతో అంచనాలకు కోత పెట్టినట్లు తెలిపింది. 2022లో ఆసియా వృద్థి రేటు తిరిగి 5.7 శాతానికి పెరుగొచ్చని తెలిపింది. ఇంతక్రితం ఏప్రిల్‌లో 5.3 శాతంగా అంచనా వేసింది.