Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ వైదొలగనున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ఆ హోదా నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు ఐఎంఎఫ్ తెలిపింది. 49 ఏళ్ల ఇండో ఆమెరికన్ గీతా 2019 జనవరిలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమితులయ్యారు. హార్వార్డ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పని చేసేవారు. త్వరలోనే ఆమె స్థానంలో మరొక్కరిని ఎంపిక చేయడానికి కసరత్తు ప్రారంభించనున్నామని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్టియాన జర్జీవా తెలిపారు.