Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: యుఎస్, ఇండియాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెడ్‌క్లిఫ్ లైఫ్‌టెక్ విభాగమైన రెడ్‌క్లిఫ్ లైఫ్ డయాగ్నోస్టిక్స్, తమ అత్యాధునిక ల్యాబ్‌ను హైదరాబాద్‌లో తెరిచింది. తెలంగాణా రాష్ట్రంలో రోగ నిర్థారణ పరీక్షల కోసం వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను తీర్చే రీతిలో ఇక్కడ సమగ్రమైన ఏర్పాట్లును చేశారు. కలెక్షన్ కేంద్రాలలో ఎక్కువ సమయం నిరీక్షించడాన్ని నిరోధించాలనుకునే ప్రజల అవసరాలను గుర్తించడంతో పాటుగా స్వీయ నిర్ధారణ పరీక్షల కోసం సబ్‌స్ర్కైబ్ చేయాలనుకుంటున్న అన్ని ఆదాయ వర్గాల ప్రజల అవసరాలనూ తీరుస్తూనే, స్వీయ సంరక్షణ పట్ల పెరిగిన అవగాహనతో హోమ్ కలెక్షన్ కోసం ఆశ్రయిస్తున్న ప్రజల అవసరాలను తీర్చేందుకు భారతదేశంలో పలు నగరాల వ్యాప్తంగా తమ ల్యాబ్‌లను ప్రారంభించడం ద్వారా నివారణ ఆరోగ్య సంరక్షణను ప్రతి ఒక్కరికీ చేరువ చేస్తుంది.
సౌకర్యం, లభ్యత, ఖచ్చితత్త్వం, విశ్వసనీయత కారణంగా హోమ్ కలెక్షన్ డయాగ్నోస్టిక్స్ సేవలలో పెరుగుదల కనిపిస్తుండటంతో రెడ్‌క్లిఫ్ లైఫ్ డయాగ్నోస్టిక్స్ వ్యూహాత్మకంగా ఈ ల్యాబ్‌ను ఏర్పాటుచేసింది. దీనిద్వారా అత్యధిక డిమాండ్ ఉన్నప్నటికీ అదే రోజు ఫలితాలను అందించడం వీలవుతుంది. గత వారం ఈ సంస్థ సమంతతో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ చిత్రాలలో సుప్రసిద్ధ నటిగా వెలుగొందుతున్న సమంత, బ్రాండ్ యొక్క డయాగ్నోస్టిక్స్, పాథాలజీ, రేడియాలజీ సేవలకు తగిన ప్రచారం చేయనున్నారు.
ఈ ఆవిష్కరణ గురించి ధీరజ్ జైన్, ఫౌండర్, రెడ్‌క్లిఫ్ లైఫ్ డయాగ్నోస్టిక్స్ మాట్లాడుతూ ‘‘నివారణ ఆరోగ్య పరీక్షలకు అత్యధిక డిమాండ్ చూడటంతో పాటుగా నిరంతర వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని మేము ఈ ల్యాబ్‌ను ప్రారంభించాము. కంపెనీ వృద్ధిలో ఇది ఒక మైలురాయిగా నిలువనుంది. మేము మా 24 గంటల హోమ్ కలెక్షన్ సేవలను మా అత్యాధునిక రీజనల్ రిఫరెన్స్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్‌తో కొనసాగించనున్నాం. 2023 నాటికి దేశంలో టాప్ 5 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలలో ఒకటిగా నిలువనున్నాం. డయాగ్నోస్టిక్ రంగ వేగవంతమైన వృద్ధి పరిగణలోకి తీసుకుని, నగరంలో మరే సంస్థ అందించలేని విస్తృతశ్రేణి పరీక్షలతో ఆన్లైన్, గృహ ఆధారిత నిర్థారిత పరీక్షల పరంగా అగ్ర గామిగా నిలువనున్నాం’’ అని అన్నారు. జన్యు పరమైన, అత్యాధునిక డయాగ్నోస్టిక్స్ సాంకేతికతలైనటువంటి క్యాన్సర్ సీక్వెన్సింగ్, ప్రీ–నాటల్ హెల్త్, కెరీర్ స్ర్కీనింగ్, వెల్నెస్, న్యూట్రిషన్వంటి సేవలలో అగ్రగామిగా రెడ్‌క్లిఫ్ లైఫ్ డయాగ్నోస్టిక్స్ వెలుగొందుతుంది.