Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: యువ మేధస్సులకు కంప్యూటర్ సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో స్ఫూర్తి నింపే కార్యక్రమానికి విద్యాశాఖ ఇన్నోవేషన్ సెల్, నీతి ఆయోగకు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్, సిబిఎస్ఇ, కోడ్.ఆర్గ్ మద్ధతు అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ద్వారా భారతదేశంలోని పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, క్లౌండ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ల గురించి తెలుసుకునే, ఆవిష్కరించుకునే అవకాశాలను అందించే కార్యక్రమం ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్స్ ఛాలెంజ్‌ను ప్రకటించింది. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది డిజిటల్ మార్పు మరియు ఆవిష్కరణలకు పునాదిగా ఉంది మరియు కృత్రిమ మేధస్సు ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమల్లో కలిగిస్తున్న నేపథ్యంలో తదుపరి తరాలకు ఈ సాంకేతికత గురించి చిన్న వయసులోనే పరిచయం చేయవలసిన అవసరం ఎక్కువగా ఉంది.
ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్ ఛాలెంజ్ భారతదేశంలో పాఠశాల విద్యార్థులకు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐలను చిన్న వయసులోనే తెలుసుకునే, అలవర్చుకునే అవకాశాన్ని ఇస్తూ, డిజైన్ మరియు కంప్యుటేషనల్ ఆలోచనలకు స్ఫూర్తి నింపుతుంది. చిన్న వయసులో విజ్ఞాన సంబంధిత అవగాహనను వృద్ధి చేసుకునేందుకు మద్ధతు ఇస్తుంది. ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖలోని ఇన్నోవేషన్ సెల్ (కేంద్ర ప్రభుత్వం), అటల్ ఇన్నోవేషన్ మిషన్(AIM)- నీతి ఆయోగ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మద్ధతుతో నిర్వహిస్తున్నారు. దీనికి కోడ్.ఆర్గ్ లెర్నింగ్ కంటెంట్, ప్రాజెక్ట్ నిర్మాణ పరికరాలతో మద్ధతు ఇస్తోంది.
ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్స్ ఛాలెంజ్ పాఠశాలలకు వారి విద్యార్థులకు ‘కృత్రిమ మేధస్సు (AI) భారతదేశపు భవిష్యత్తులను ఎలా మార్చగలదు’ అనే విషయం గురించి ఆవిష్కారాత్మక, సృజనశీలకమైన యోజనలను విద్య, ఆరోగ్య సేవ, సేద్యం, రవాణా తదితర ఉప విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ పోటీలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలూ పాల్గొనేందుకు అవకాశం ఉంది. 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులుగా ఉంటారు. ఒకసారి పాఠశాల ఈ కార్యక్రమానికి సంబంధించిన వెబ్సైట్లో రిజిస్ట్రరు అయిన అనంతరం వారు ఎడబ్ల్యూఎస్, ఎఐఎం, కోడ్.ఆర్గ్ల నుంచి క్లౌండ్ కంప్యూటింగ్, ఏఐ అంశాల గురించి లెర్నింగ్ వనరులను అందుకుంటారు. విద్యార్థులు ఈ లెర్నింగ్ మోడళ్లను పూర్తి చేయవలసి ఉంటుంది. అనంతరం పాల్గొనే విద్యార్థులతో పంచుకోవలసి ఉంటుంది. లెర్నింగ్ మాడ్యూళ్లను పూర్తి చేసిన విద్యార్థులు అనంతరం వారి ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొనవలసి ఉంటుంది. పాఠశాలలు ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్ ఛాలెంజ్‌కు అనుగుణమైన నిబంధనల ఆదారంగా ఎంట్రీలను మూల్యాంకన చేస్తారు. వారి అత్యుత్తమ రెండు ప్రాజెక్టులను మరింత మూల్యాంకనకు సమర్పిస్తారు. బయటి నుంచి న్యాయ నిర్ణేతలు జాతీయ స్థాయిలో ఎంట్రీలను మూల్యాంకనకు చేస్తారు మరియు భారతదేశ వ్యాప్తంగా టాప్ 10 పాఠశాలల ఎంట్రీలను నవంబరు 15, 2021లో లైవ్ వర్చ్యువల్ షోకేస్ కార్యక్రమంలో సమర్పిస్తారు.
టాప్ 10 పాఠశాలలు ఎడబ్ల్యూఎస్ ప్రాయోజకత్వంలోని వర్చ్యువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ /మెషిన్ లెర్నింగ్ (AI/ ML) ల్యాబ్‌ను ఒక ఏడాదికి, ట్రోఫీలు, అమెజాన్ వోచర్లు, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (SIH) జూనియర్స్ ట్రాక్‌కు నేరుగా ప్రవేశాన్ని పొందుతారు. దాన్ని భారత కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖలోని ఇన్నోవేషన్ సెల్ 2022 మధ్యలో నిర్వహిస్తుంది. అదనపు పురస్కరాలను టాప్ 100 పాఠశాలలు, గరిష్ఠంగా ప్రాజెక్టులు సమర్పించిన టాప్ 3 పాఠశాలలు, ప్రజల నుంచి ఎక్కువ ప్రశంసలతో ఓట్లు దక్కించుకున్న టాప్ 3 దరఖాస్తులకు ఇస్తారు. అర్హత దక్కించుకున్న ఎంట్రీలతో కలసి ఇందులో పాల్గొన్న విద్యార్థులు అందరికీ ప్రమాణ పత్రాలు అందిస్తారు.
ఎడబ్ల్యూఎస్ యంగ్ బిల్డర్స్ ఛాలెంజ్ అక్టోబరు 18న ప్రారంభమైంది. దరఖాస్తులను నవంబరు 5, 2021 వరకు స్వీకరిస్తారు. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని నవంబరు 15న ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.