Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారతదేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో 100 బేబీ ఫీడింగ్ గదులను ప్రారంభించి సరికొత్త మైలురాయికి చేరుకున్న హిమాలయ
హైదరాబాద్: ప్రయాణం చేస్తున్న సందర్భంలో తల్లులు తమ బిడ్డలకు పరిశుభ్రంగా, అనుకూలమైన నర్సింగ్ అనుభవాన్ని ఇవ్వాలన్న తమ ప్రయత్నాలకు కొనసాగింపుగా, శిశువుల సంరక్షణలో అత్యంత అగ్రగామి మరియు విశ్వసనీయమైన బ్రాండ్లలో ఒకటైన హిమాలయ, జైపూర్ విమానాశ్రయంలో బిడ్డలకు పాలు తాగించే తన 100వ గదిని ప్రారంభించింది. హిమాలయ ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, కోయంబత్తూరు, మంగళూరు తదితర 17 నగరాల్లో బిడ్డలకు పాలు పట్టించే గదులను ప్రారంభించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఆరేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న కేవలం 40% మంది శిశువులు మాత్రమే ప్రత్యేకంగా తల్లి పాలు తాగుతున్నారు. బిడ్డ రొమ్ముపాలు తాగడం ద్వారా జీవితాంతం అనుకూలతలు ఉండగా, బిడ్డల శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడతాయి. తల్లి తన బిడ్డకు పాలు తాగించేందుకు ప్రత్యేకమైన గదుల ప్రాముఖ్యత గురించి హిమాలయ వెల్నెస్ కంపెనీ బిజినెస్ డైరెక్టర్ రాజేశ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ‘బహిరంగ ప్రదేశాల్లో నర్సింగ్, బిడ్డలకు పాలు పట్టించడం భారతదేశంలో సాధారణమైన అంశం కాదు. మహిళలు తమ బిడ్డలకు పాలు తాగించే సమయంలో స్థలాన్ని గుర్తించడంలో, ముఖ్యంగా ప్రయాణించే సమయంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. హిమాలయలో మేము తల్లి అలాగే బిడ్డకు అత్యుత్తమమైన సంరక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నాము. వెల్సెస్ ద్వారా సంతోషాలను విస్తరించే మా భరోసాకు అనుగుణంగా మేము 2012 నుంచి పరిశుభ్రమైన నర్సింగ్ సేవలను అందించేందుకు మేము శ్రమిస్తున్నాము. గతాన్ని ఒకసారి అవలోకిస్తే, రద్దీగా ఉండే 17 విమానాశ్రయాల్లో మా అడుగు జాడలు ఉండగా, ఈ ప్రయత్నం ద్వారా అత్యంత భారీ ప్రమాణంలో ప్రయాణీకులను చేరుకునేందుకు సాధ్యం అయింది’’ అని తెలిపారు.
ఈ ప్రయత్నం తల్లి తన బిడ్డకు పాలు తాగించడాన్ని ఉత్తేజిస్తుండగా, అది శిశువుల సమగ్ర ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైనది. విమానాశ్రయాల్లోకి వెళ్లే, బయటకు వచ్చే టెర్మినల్స్‌లో హిమాలయ బేబీ కేర్ సౌకర్యాలు తల్లులు, బిడ్డలకు అనుకూలకరమైన స్థలాన్ని అందిస్తుండగా, హ్యాండ్ శానిటైజర్, బేబీ వాష్ మరియు బేబీ లోషన్ ఉచితంగా వినియోగించుకునేందుకు అవి అందుబాటులో ఉంటాయి. జైపూర్‌తో పాటు చెన్నై, పుణె, భోపాల్, శిరడి, క్యాలికట్, తిరుచ్చి మరియు గౌహతి విమానాశ్రయాల్లో హిమాలయ తన బేబీ ఫీడింగ్ గదులను ప్రారంభించింది.
అభినందనలు:
లక్ష్య మీడియా ప్రయివేట్ లిమిటెడ్ గ్లోబల్ ఉపాధ్యక్షుడు, రెవెన్యూ అధికారి గగన్ శర్మ మాట్లాడుతూ 'నేను స్వచ్ఛత, అనుకూలకరమైన స్థలాలను ప్రయాణించే తల్లులు, వారి బిడ్డలకు అందించే లక్ష్యాన్ని కల్పించడంలో మరో మైలురాయికి చేరుకున్నందుకు, వారి 100వ శిశు సంరక్షణ గదిని జైపూర్ విమానాశ్రయంలో ప్రారంభించినందుకు హిమాలయను అభినందిస్తాను. హిమాలయ గత ఏడాది మా భాగస్వామ్యపు అవధిలో హైదరాబాద్ విమానాశ్రయం ఎకోసిస్టమ్‌లో భాగం కాగా, మా శిశు సంరక్షణ గదులను అనుకూలకరమైన సౌకర్యంగా మార్చుతూ, ప్రయాణించే తల్లిదండ్రులకు వారి బిడ్డల అవసరాలను పరిష్కరిస్తూ, వారి ప్రయాణంలో బాధ్యత వహించేందుకు, వారికి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చే, వారి శిశులకు సంబంధించిన విధంగా సేవల గురించి ఉన్న కొలమానాలను అనుగుణంగా అందిస్తోంది. ఈ ప్రత్యేక సేవను వారు ప్రేమతో ఆదరిస్తారన్న భరోసాతో పాటు, ఇది వాస్తవానికి తల్లిదండ్రులకు ప్రాణాలను నిలిపే చర్యగా ఉంటుంది. హిమాలయకు మేలు జరగాలి!' అని ఆశించారు.
టిఎంఐ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హిమాలయ నేషనల్ సేల్స్ హెడ్, సీనియరు ఉపాధ్యక్షుడు, రజనీశ్ ధవన్ మాట్లాడుతూ 'బేబీ కేర్ ‘‘శిశువులతో ప్రయాణించే తల్లులకు పరిశుభ్రమైన, అనుకూలకరమైన స్థలాన్ని అందించడం’’ ఢిల్లీ విమానాశ్రయంలో బేబీ కేర్ గదులకు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది సహజ ఎంపికగా ఉంది. టిఐఎండిఎఎ 2020 నుంచి హిమాలయతో పరస్పరం పురస్కారయుతమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ప్రయాణించే తల్లులు, శిశువులకు విశ్రాంతి, అవిస్మరణీయ బాంధవ్యపు అనుభవాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో హిమాలయ బేబీ కేర్ వారి మృదువైన, విశ్వసనీయమైన ఉత్పత్తులతో అందిస్తోంది. హిమాలయ బేబీకేర్కు వారి 100వ బేబీకేర్ గది ఏర్పాటుకు అభినందిస్తున్నాను. వారికి అటువంటి మరిన్ని మైలురాళ్లు సాధించాలని కోరుకుంటున్నాను' అని తెలపారు.