Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఫేస్ బుక్ తొలి గేమింగ్ ఈవెంట్ ఎఫ్ బీ గేమింగ్ ప్రెస్ స్టార్ట్ ను ఇండియాలో నిర్వహించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ వర్చుల్ ఈవెంట్ లో గేమ్ డెవలపర్లు, పబ్లిషర్స్, క్రియేటర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫేస్ బుక్ ఇండియా బిజినెస్ డెవలప్ మెంట్ డైరెక్టర్ మనోహర్ హోచం దాని మాట్లాడుతూ... ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ మార్కెట్లలో భారత్ ఎదుగుతోందన్నారు. ఫేస్ బుక్ లో గేమింగ్ పై, ముఖ్యంగా లైవ్ వ్యూయర్షిప్ గేమింగ్ వీడియోపై ఎక్కువ మంది దృష్టి పెట్టడాన్ని గమనించామన్నారు. గత ఏడాదిలో గేమింగ్ వీడియో చూసేవారి సంఖ్య 530 శాతంకు పైగా పెరిగిందన్నారు. దేశంలో గేమింగ్ ఎకోసిస్టమ్ ను నిర్మించడానికి, గేమింగ్ కంటెంట్, పరిశ్రమను నడిపించే వ్యాపారాలను ఇష్టపడే వ్యక్తుల కోసం విలువను సృష్టించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.