Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: HDFC బ్యాంక్, మాస్టర్ కార్డ్, US ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (DFC), US ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (USAID) ఇవాళ భారతదేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చాయి. అందులో భాగంగా ఇవాళ సుమారు 100 మిలియన్ డాలర్లు రుణ సదుపాయాన్ని అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ రుణాలను ప్రత్యేకంగా తమ సంస్థలో 50 శాతం మహిళా ఉద్యోగస్థులను నియమించే కొత్త సంస్థలకు అందించనున్నారు. అన్నింటికి మించి మహమ్మారి నుంచి తిరిగి కోలుకోవాలని ప్రయత్నిస్తున్న చిన్న చిన్న సంస్థలకు, అలాగే తమ సంస్థను డిజిటలైజ్ చేసుకోవాలనే వ్యాపారాలను అందించనున్నారు.
కోవిడ్ -19 చిన్న వ్యాపారాలపై పెను ప్రభావాన్ని చూపింది. చాలా మంది తమ వ్యాపారాలను పూర్తిగా క్లోజ్ చేసుకునేలా చేసింది. దాంతోపాటు… డిజిటలైజ్ వైపు చాలా త్వరితంగా మారాల్సి వచ్చింది. ఇదే సమయంలో కొన్ని సంస్థలు తమ పోటీ సంస్థలతో డిజిటల్‌గా మారలేకపోయాయి. అందుకోసమే చిన్న వ్యాపారాలు పోటీతత్వంతో ఉండటానికి మరియు కస్టమర్ విధేయతను నిలుపుకోవడానికి మారుతున్న మార్కెట్ డైనమిక్స్, వినియోగదారు ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండేందుకు ఈ రుణాలు చిన్న వ్యాపారాలను ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ కొత్త క్రెడిట్ సౌకర్యం చిన్న వ్యాపారస్తులు వారి కార్యకలాపాలను నిర్వహించడానికి, వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫైనాన్సింగ్ అవసరమయ్యే చిన్న వ్యాపారాలకు రుణాన్ని విస్తరించడం, డిజిటలైజేషన్ ద్వారా రికవరీని ప్రారంభించడం, మహిళల నేతృత్వంలోని వ్యాపారాలకు మద్దతు ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతుంది.
"భారతదేశంలోని చిన్న వ్యాపారాలకు మద్దతునిచ్చే ప్రయత్నంలో మాస్టర్ కార్డ్, USAID, DFC లతో చేతులు కలపడం HDFC బ్యాంక్‌కు గర్వంగా ఉంది. MSMEలు భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివి. మహమ్మారి వారి జీవితాలను, వ్యాపారాలపై పెను ప్రభావం చూపింది. ఇప్పుడు ఈ భాగస్వామ్యంతో క్రెడిట్‌ను పొడిగించడంలో సహాయపడటమే కాకుండా, వారి వ్యాపారాలను ఆధునీకరించడానికి, డిజిటైజ్ చేయడానికి వారికి తగు సలహాలు ఇచ్చి సహాయం చేస్తుంది. అంతేకాకుండా భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, వారి వ్యవస్థాపక ప్రయాణంలో అర్ధవంతమైన భాగస్వామిగా ఉండాలనే మా నిబద్ధతకు ఈ ప్రయత్నం అద్దం పడుతుంది అని అన్నారు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాణిజ్య మరియు గ్రామీణ బ్యాంకింగ్ గ్రూప్ హెడ్ రాహుల్ శుక్లా.
"USAIDలో, లింగ సమానత్వం, మహిళా సాధికారత అభివృద్ధిలో చాలా కీలకంగా వ్యవహరించే ముఖ్య సూత్రాలు అని మేము బలంగా నమ్ముతున్నాము. భారతదేశంలోని మహిళలు COVID-19 మహమ్మారి ద్వారా చాలా ప్రభావితమయ్యారు. వారి కుటుంబాలు, సంఘాల జీవనోపాధిని నేరుగా ప్రభావితం చేసే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో మహమ్మారి నుండి వాళ్లు కోలుకోవాలి. వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవాలి. అంతేకాకుండా మహిళా యాజమాన్యాల చేతుల్లో ఉన్న చిన్న వ్యాపారాలు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవ్వాలి. అందుకు వారికి తగిన విధంగా రుణాలను అందించాలి. అందుకోసమే మా ఈ ప్రయత్నం అని అన్నారు USAID ఇండియా మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి. "భారతదేశంలో డిజిటలైజ్ చేయడానికి, ఆధునీకరించడానికి చిన్న వ్యాపారాలకు, ప్రత్యేకించి మహిళల యాజమాన్యంలోని ఫైనాన్సింగ్‌ని విస్తరించే ప్రయత్నంలో భాగం అయినందుకు DFC గర్వంగా ఉంది. ఈ ఫైనాన్సింగ్ భారతదేశంలోని మహిళలు తమ వ్యాపారాన్ని కొనసాగడానికి, వ్యవస్థాపకులుగా విజయం సాధించడానికి, మరింత ఆర్థికంగా సాధికారత పొందడానికి వీలు కల్పిస్తుంది, ఇది కోవిడ్ -19 అనంతర ఆర్థిక స్థిరీకరణ, జిడిపి వృద్ధికి, లింగంతో సంబంధం లేకుండా పెరిగిన ఉపాధికి దారితీస్తుంది అని అన్నారు DFC కార్యాలయ వైస్ ప్రెసిడెంట్, హెడ్ గ్లోబల్ జెండర్ ఈక్విటీ ఇనిషియేటివ్స్ అల్జీన్ సెజరీ
"ప్రైవేట్ రంగం, ప్రభుత్వం మరియు పరోపకారం యొక్క బలాన్ని సమన్వయపరిచే భాగస్వామ్యాలు మహమ్మారి నుండి మరింత బలోపేతం కావడానికి కీలకమైనవి. HDFC బ్యాంక్, USAID, DFC తో మాస్టర్ కార్డ్ భాగస్వామ్యం సకాలంలో ఉంది. ఇది డిజిటల్ ఎకానమీలో ఎక్కువ భాగస్వామ్యం ద్వారా స్థితిస్థాపకతను పెంపొందించడానికి, వారి డిజిటలైజేషన్ ప్రయాణంలో MSME లను ఆదుకోవడానికి అవసరమైన ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది అని అన్నారు మాస్టర్ కార్డ్ దక్షిణాసియా డివిజన్ అధ్యక్షుడు నిఖిల్ సాహ్ని.
ఈ భాగస్వామ్యం ఎలా పనిచేస్తుంది?
చిన్న వ్యాపారాలు, మహిళా పారిశ్రామికవేత్తలు డిజిటల్ ఎకానమీకి శక్తినిచ్చే నెట్‌వర్క్‌లకు కనెక్ట్ అయ్యేలా చేయడానికి, HDFC బ్యాంక్ తన ప్రస్తుత కస్టమర్ బేస్‌కు మించి ఈ క్రెడిట్ సదుపాయంలో కనీసం 50% కొత్త చిన్న వ్యాపార రుణగ్రహీతలకు అందుబాటులో ఉండేలా చేస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణం ఇవ్వడానికి కనీసం 50% సౌకర్యం ఉపయోగించబడుతోంది. HDFC బ్యాంక్ వారి విస్తృతమైన దేశవ్యాప్త బ్రాంచ్ నెట్వర్క్ ద్వారా క్రెడిట్‌ను ఛానెల్ చేస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియన్ ట్రేడర్స్ (CAIT)తో ఇప్పటికే ఉన్న సహకారాల ద్వారా, మాస్టర్ కార్డ్ చిన్న వ్యాపార యజమానులకు వారి డిజిటలైజేషన్ ఎంపికలపై నైపుణ్యాల శిక్షణ, విద్యను అందిస్తుంది. మాస్టర్ కార్డ్ సెంటర్ ఫర్ ఇన్‌క్లుజివ్ గ్రోత్.. దేశవ్యాప్తంగా దాతృత్వ శిక్షణా కార్యక్రమాల ద్వారా వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. భారతదేశంలోని చిన్న వ్యాపారాలు కోవిడ్ -19 ప్రభావం నుండి కోలుకోవడానికి మాస్టర్ కార్డ్ యొక్క INR 250 కోట్ల (33 మిలియన్ డాలర్లు) నిబద్ధతలో భాగం.
DFC, USAID చిన్న వ్యాపార యజమానులకు HDFC బ్యాంక్ రుణాలు డి-రిస్క్ చేయడం ద్వారా క్రెడిట్ సదుపాయాన్ని పొడిగించడాన్ని సులభతరం చేస్తున్నాయి. DFC యొక్క పెట్టుబడి దాని 2X ఉమెన్స్ ఇనిషియేటివ్‌కి మద్దతు ఇస్తుంది, దీని ద్వారా ఏజెన్సీ మహిళల యాజమాన్యంలోని ప్రాజెక్టులు, మహిళల నేతృత్వంలో లేదా మహిళలకు సాధికారత అందించే ఉత్పత్తి లేదా సేవలను అందిస్తుంది. ఈ కార్యక్రమం భారతదేశంలో USAID యొక్క COVID-19 ప్రతిస్పందనతో పాటు దాని ప్రపంచ మహిళా ఆర్థిక సాధికారత నిధి చొరవలో భాగం.