Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు కలిగి ఉండటంతో పాటుగా, టైమ్స్ ఆఫ్ ఇండియా (టీఓఐ) 2020 అధ్యయనంలో భారతదేశంలో ఇంజినీరింగ్ కోసం అత్యుత్తమ 7వ ప్రైవేట్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్‌గా గుర్తింపు పొందిన, పూనె కేంద్రంగా కలిగిన ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ (ఎంఐటీ–డబ్ల్యుపీయు), పెట్రోలియం ఇంజినీరింగ్‌లో బీటెక్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. భూ ఉపరితలం నుంచి స్వచ్ఛమైన శక్తిని పొందాల్సిన ఆవశ్యకతతో పాటుగా క్రూడ్ ఆయిల్‌ను నిల్వ చేయడం అనేది, ఔషదాలు, వ్యవసాయ రసాయనాలు, ఇతర పెట్రో కెమికల్స్ (పాలిమర్స్, సింథటిక్ డిటర్జెంట్లు), ఉత్పత్తి కోసం తప్పనిసరి.
ఇంజినీరింగ్ ఔత్సాహికులకు పిలుపునిస్తూ ప్రారంభించిన ఈ పెట్రోలియం ఇంజినీరింగ్‌లో బీటెక్ ప్రోగ్రామ్ తో ఎంఐటీ–డబ్ల్యుపీయు, నాలుగు ఉప విభాగాలైనటువంటి – డ్రిల్లింగ్ ఇంజినీరింగ్, ఎక్స్‌ప్లోరేషన్, ప్రొడక్షన్, రిజర్వాయర్ ఇంజినీరింగ్–లలో అత్యున్నత శిక్షణను సృష్టించే లక్ష్యం చేసుకుంది. ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం, ఈ బోధనాంశాల పట్ల లోతైన అవగాహన కలిగిన,పరిశ్రమ సిద్ధమైన అత్యుత్తమ ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దడం. ఎంఐటీ–డబ్ల్యుపీయు నుంచి పెట్రోలియం ఇంజినీరింగ్‌లో ఓ కోర్సు రావడం వల్ల ఒక్కటి మాత్రమేకాదు, బహుళ కెరీర్ అవకాశాలు అయినటువంటి డ్రిల్లింగ్ ఇంజినీర్, ఆయిల్ వెల్ సిమెంటింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఇంజినీర్, వెల్ కంప్లీషన్ ఇంజినీర్, పెట్రోలియం ఎకనమిస్ట్, రిజర్వాయర్ ఇంజినీర్, పైపింగ్ ఇంజినీరింగ్, ఫ్లో అస్యూరెన్స్, వెల్ కంప్లీషన్, వర్క్ఓవర్ ఇంజినీర్, డాటా ఎనలిస్ట్, ఆయిల్ ఫీల్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ మార్కెటింగ్, ఐటీ కంపెనీలలో డొమైన్ ఎక్స్పర్ట్ వంటి అవకాశాలూ కలుగుతాయి. ఈ ఇనిస్టిట్యూట్ అత్యద్భుతమైన ఎనలిటికల్, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను సైతం విద్యార్థులు పొందగలిగేలా శిక్షణ అందిస్తుంది. ప్రొఫెషనల్‌గా పనిచేయాలనుకునే వారికిఇది అత్యంత ముఖ్యమైన అంశంగా నిలుస్తుంది.
క్రూడ్ ఆయిల్‌ను బయటకు తీయడం అనేది సాధారణంగా సెడిమెంటరీ రాక్స్ నుంచి జరుగుతుంది. ఇది తీవ్రమైన ఇంజినీరింగ్ సవాల్ కాకపోయినప్పటికీ, సరైన శిక్షణ మాత్రం అవసరం. పెట్రోలియం ఇంజినీర్, తప్పనిసరిగా సృజనాత్మక ఆలోచనలతో రావడంతో స్థిరంగా ముందుకు వచ్చి వినూత్నమైన పద్ధతులను డిజైన్ చేయడంతో పాటుగా భూ ఉపరితలం లోపల దాగిన ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైన పద్ధతులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. భావితరపు పెట్రోలియం ఇంజినీర్లను తీర్చిదిద్దడానికి ఎంఐటీ–డబ్ల్యుపీయు అత్యాధునిక కరిక్యులమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉంటుంది.
ఎంఐటీ–డబ్ల్యుపీయు స్కూల్ ఆఫ్ పెట్రోలియం ఇంజినీరింగ్, భారతదేశంలో ప్రీమియర్ పెట్రోలియం ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూషన్స్‌లో ఒకటి. ఖచ్చితత్త్వంతో ప్రణాళిక చేసిన అభ్యాసాంశాలతో తమ విద్యార్థులకు తగిన అవగాహన కల్పిస్తామని ఈ ఇనిస్టిట్యూట్ ప్రతిజ్ఞ చేయడంతో పాటుగా తమ నాలుగు సంవత్సరాల ఫుల్ టైమ్ ప్రోగ్రామ్ ద్వారా పలు అవకాశాలను సైతం అందిస్తుంది. ఈ కోర్సును పన్నెండు త్రైమాసాలుగా విభజించడం జరిగింది. ఇది ఛాయిస్ ఆధారిత 166 క్రెడిట్ వ్యవస్థ. సమగ్రమైన విద్యనందించడాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని, వారు పలు జాతీయ మరియు అంతర్జాతీయ స్టడీ టూర్లను చేపట్టారు. అవి తమ విద్యార్థులు పరిశ్రమ అవగాహన పెంపొందించుకోవడంతో పాటుగా అనుభవపూర్వక అభ్యాసం పొందేందుకు సైతం తోడ్పడనున్నాయి. అంతేకాదు, పలు ఫీల్డ్ ట్రిప్స్ , పారిశ్రామిక సందర్శనలు విద్యార్థులు ఈ కోర్సు నుంచి మరింతగా తెలుసుకునేందుకు సైతం తోడ్పడతాయి. బోధన పరంగా శ్రేష్టతను సాధించేందుకు పూర్తి అంకిత భావం చూపడంతో పాటుగా తగిన పరిజ్ఞానమూ అందిస్తున్న ఎంఐటీ –డబ్ల్యుపీయు సాటి లేని అభ్యాస అనుభవాలను విద్యార్ధులకు అందిస్తూనే, పెట్రోలియం ఇంజినీరింగ్ గురించి మరింతగా తెలుసుకునే అవకాశమూ అందిస్తుంది.
ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్శిటీ , అత్యంత స్నేహ పూరిత వాతావరణంలో నాలెడ్జ్ హబ్‌ను సృష్టించేందుకు కృషి చేస్తుంది. ఇక్కడ విద్యార్థులు సౌకర్యవంతమైన ఆవాసంలో అభ్యసించడం, పంచుకోవడం, ప్రకాశించడం జరుగుతుంది. విద్యార్థులకు వారి ప్రతిభ , కరిక్యులమ్ పెర్ఫార్మెన్స్ పరంగా స్కాలర్షిప్లను సైతం అందిస్తారు. విస్తృతశ్రేణిలో విద్యాంశాలను అందించడంలో ఎంఐటీ–డబ్ల్యుపీయు అత్యంత ప్రాచుర్యం పొందింది. విలువ ఆధారిత యూనివర్శిల్ విద్యా వ్యవస్థ ద్వారా శాంతి సంస్కృతిని ప్రచారం చేయడానికి కృషి చేస్తున్న సంస్ధ వ్యాపార విజ్ఞానం,కంప్యూటర్ సైన్స్ , సాంకేతికతను సమాజ సంక్షేమంకోసం ఉపయోగించాలని కోరుకుంటుంది.
విద్యార్థులకు ప్రీమియం నాణ్యత విద్యా అనుభవాలను అందించే దిశగా ఎంఐటీ–డబ్ల్యుపీయు యొక్క బహుళ క్రమశిక్షణా విధానం కారణంగానే దేశంలో అత్యుత్తమ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలువగలిగింది. వీరు అత్యున్నతంగా పరిశోధన చేసిన డబ్ల్యుపీయు పద్ధతులను అమలు చేయడంతో పాటుగా అనుభవపూర్వక అభ్యాసం ద్వారా విద్యా కార్యాచరణ పరంగా ఖచ్చితమైన సమతుల్యతను తీసుకువస్తుంది.