Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామ్కో మ్యూచువల్ ఫండ్ డైరెక్టర్ వెల్లడి
హైదరాబాద్ : వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో 10 శాతం మార్కెట్ వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సామ్కో అసెట్ మేనేజ్మెంట్ ప్రయివేటు లిమిటెడ్ వ్యవస్థాపకులు, డైరెక్టర్ జిమీత్ మోడీ తెలిపారు. వచ్చే ఈ కాలంలో రూ.7,500 కోట్ల నుంచి రూ.800 కోట్ల అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఎయుఎం) ఆస్తులను చేరుకోవాలని నిర్దేశించుకున్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపిలో 3వేలు, తెలంగాణలో 2,000కు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పెంచుకోనున్నామన్నారు. జిడిపిలో తెలంగాణ 4.56 శాతం వాటా కలిగి ఉందని.. కానీ ఎంఎఫ్ పరిశ్రమలో 1.63 శాతం వాటా మాత్రమే కలిగి ఉందన్నారు. దీంతో ఇక్కడ తమకు విస్తృతావకాశాలున్నాయన్నారు.