Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన ప్రైమ్ సభ్యత్వ ఫీజును 50 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ రూ.999గా ఉన్న ఈ మొత్తం త్వరలోనే రూ.1499కు చేరనుంది. నెలవారీ, మూడు నెలల ప్లాన్స్‌కు సంబంధించిన ఫీజులను కూడా అమెజాన్ మార్చింది. ఈ కొత్త రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను రుసం రూ.329 వసూలు చేస్తుండగా.. ఇప్పుడది రూ.459కి.. నెలవారీ ఫీజు రూ.129 నుంచి రూ.179కి చేరనుంది.