Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో ఐడీబీఐ బ్యాంక్ మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభాలు 75 శాతం పెరిగి రూ.567 కోట్లకు చేరాయి. నికర వడ్డీపై ఆదాయం పెరగ్గా.. కేటాయింపుల భారం తగ్గింది. ముంబయి కేంద్రంగా పని చేస్తోన్న ఈ బ్యాంక్ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.324 కోట్ల లాభాలు ఆర్జించింది. గడిచిన త్రైమాసికంలో మొండి బాకీలకు కేటాయింపులు 12 శాతం తగ్గి రూ.642 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే క్యూ2లో రూ.730 కోట్ల కేటాయింపులు చేసింది. స్థూల నిరర్ధక ఆస్తులు 25.08 శాతం నుంచి 20.92 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు 2.67శాతం నుంచి 1.67 శాతానికి దిగివచ్చాయి. సెప్టెంబర్ 2021 నాటికి బ్యాంక్ స్థూల అడ్వాన్సులు యథాతథంగా రూ.1,64,506 కోట్లుగా నమోదయ్యాయి.