Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయత్రైమాసికం (క్యూ2)లో 102.7 శాతం వృద్థితో రూ.264 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.130 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో నికర వడ్డీపై ఆదాయం రూ.1,120 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ2లో 33.84 శాతం పెరిగి రూ.1,500 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 22.61 శాతం పెరిగి రూ.493 కోట్లుగా నమోదయ్యింది. ఇందులో డీహెచ్ఎఫ్ఎల్ నుంచి రికవరీ చేసిన రూ.260 కోట్ల ఆదాయం ఉంది. దివాలా తీసిన డీహెచ్ఎఫ్ఎల్ను పిరమల్ ఎంటర్ప్రైజెస్ స్వాధీనం చేసుకోవడంతో ఆ మొత్తాని బీఓఎంకు చెల్లించింది. గడిచిన క్యూ2లో డిపాజిట్లు 14.47శాతం పెరిగి రూ.1,81,572 కోట్లకు చేరాయి. అడ్వాన్సులు 11.44శాతం వృద్థితో రూ.1,15,236 కోట్లుగా నమోదయ్యాయి. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 5.56 శాతానికి తగ్గాయి. 2020 ఇదే సెప్టెంబర్ నాటికి ఎన్‌పిఎలు 8.81 శాతంగా ఉన్నాయి. గురువారం సెషన్లో బిఎస్ఇలో ఈ బ్యాంక్ షేర్ 4.77 శాతం పెరిగి రూ.21.95 వద్ద ముగిసింది.