Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశంలో సుప్రసిద్ధ, శాస్త్ర ఆధారిత ఆయుర్వేద కంపెనీ డాబర్ ఇండియా లిమిటెడ్ ఇప్పుడు కుటుంబమంతటికీ అధిక ప్రయోజనాన్ని కలిగించే జీర్ణక్రియ ఔషదం 'డాబర్ రెస్టోరా గోల్డ్'ను ఆవిష్కరిస్తున్నట్టు వెల్లడించింది. ఆరోగ్య వంతమైన జీర్ణక్రియను నిర్వహించడంలో ఇది తోడ్పడటంతో పాటుగా నీరసం, అలసట నుంచి ఉపశమనాన్ని ఇది అందిస్తుంది. ప్రీమియం నాణ్యత కలిగిన ఆరోగ్యదాయకమైన ఔషద ఉత్పత్తి డాబర్ రెస్టోరా గోల్డ్ . ఇది మీ శరీరం లోపల నుంచి ఉత్తేజం కావడానికి అవసరమైన అత్యవసర పోషకాలను అందిస్తుంది. శక్తి, బలం కోసం తీర్చిదిద్దబడిన అత్యున్నత ఆయుర్వేదిక్ ఔషదాలలో ఇది ఒకటి. దీనిలో అత్యంత సహజసిద్ధమైన పదార్థాలైనటువంటి నేపాల్‌లోని వ్యవసాయక్షేత్రాలలో లభించే అత్యున్నత నాణ్యత కలిగిన యాపిల్స్, అంజీర్, ఖర్జూర , ద్రాక్ష, కేసర్, సేఫ్డ్ ముస్లి, అశ్వగంధ, షతవారి వంటివి ఉన్నాయి. ఇవి ఎలాంటి దుష్ఫరిణామాలు లేకుండా పునరుద్ధరించబడిన శక్తిని అందిస్తాయి. ఈ టానిక్‌లో ఏపీఐ ప్రమాణాలకు అనుగుణంగా అతి తక్కువ ఆల్కహాల్ కంటెంట్ వినియోగించడంతో పాటుగా డబుల్ ఫిల్టరేషన్‌తో ప్రీమియం అసవ్ జోడించారు. ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు ఈ సూత్రీకరణ తోడ్పడటంతో పాటుగా శరీరంలో అవాంఛిత విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది డాబర్ ఇండియా లిమిటెడ్, కేటగిరి హెడ్ ఆయుర్వేదిక్ ఎథకల్స్ , డాక్టర్ మణ్‌దీప్ ఓబరాయ్ అన్నారు.
డాబర్ రెస్టోరా గోల్డ్ ధర 450 మిల్లీ లీటర్ల ప్యాక్ ధర 325 రూపాయలు. ఇది అన్ని సుప్రసిద్ధ ఈఉకామర్స్ వేదికలు, రెగ్యులర్ రిటైల్ ఛానెల్స్ వద్ద దేశవ్యాప్తంగా లభ్యమవుతుంది. అత్యధిక యాంటి ఆక్సిడెంట్లు కలిగిన డాబర్ రెస్టోరా గోల్డ్, ఓ పునరుద్ధరణ ఔషదం. ఇది జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటుగా ఆకలినీ పెంచుతుంది. అత్యున్నత శ్రేణి సూపర్ ఫుడ్స్‌తో లోడ్ చేయబడిన ఈ ఉత్పత్తి ఆకృతి ప్రీమియంగా ఉంటుంది. సంప్రదాయ ఔషద వ్యవస్ధ ఆయుర్వేదం. ఆరోగ్యపరంగా అవసరమైన రీతిలో శరీరం ఉండేందుకు, వ్యాధుల నివారణకు ఇది తోడ్పడుతుంది. ఎన్నో తరాలుగా, డాబర్ ఈ రంగంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్‌గా వెలుగొందుతుండటంతో పాటుగా విభిన్నమైన ఆయుర్వేద సూత్రాలతో మీ ఆరోగ్యం కాపాడుతుంది. ఇప్పుడు విడుదల చేసిన డాబర్ రెస్టోరా గోల్డ్ తో అత్యంత సురక్షితమైన, ప్రభావవంతమైన ఉత్పత్తులను ప్రతి ఇంటిలోనూ అందించాలనే మా ప్రయత్నాలలో మరో ముందుడుగు వేశాం. కుటుంబమంతటికీ పునరుత్తేజ ఔషదంగా డాబర్ రెస్టోరా గోల్డ్ నిలుస్తుంది అని డాక్టర్ ఒబరాయ్ అన్నారు.