Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగంలోని యెస్ బ్యాంక్ 2021 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 74.3 శాతం వృద్థితో రూ.225.5 కోట్ల నికర లాభాలు సాధించింది. వడ్డీయేతర ఆదాయం పెరగడం, కేటాయింపులు తగ్గడంతో మెరుగైన ఫలితాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.125.37 కోట్ల లాభాలు నమోదు చేసింది. గడిచిన త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీపై ఆదాయం 23.4 శాతం తగ్గి రూ.1,512 కోట్లుగా నమోదయ్యింది. వడ్డీయేతర ఆదాయం 30.2 శాతం పెరిగి రూ.778 కోట్లుగా చోటుచేసుకుంది. మొండి బాకీలకు కేటాయింపులు 65 శాతం తగ్గి రూ.377 కోట్లుగా నమోదయ్యాయి. మొండి బాకీలు కొంత తగ్గినప్పటికీ.. ఇప్పటికీ హెచ్చు స్థాయిలోనే ఉన్నాయి. 2021 సెప్టెంబర్ ముగింపు నాటికి యెస్ బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 14.97 శాతం లేదా రూ.28,740.59 కోట్లుగా చోటు చేసుకున్నాయి. గతేడాది ఇదే కాలం నాటికి 16.9 శాతం నిరర్ధక ఆస్తులు నమోదయ్యాయి.