Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగో రోజూ నష్టాలు
ముంబయి: గత కొన్ని నెలలుగా దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లలో తాజాగా కరెక్షన్ (దిద్దుబాటు) ప్రారంభమైనట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. వరుసగా నాలుగు రోజులు నష్టపోవడమే ఇందుకు కారణం. శుక్రవారం సెషన్లోనూ సెన్సెక్స్, నిఫ్టీలు నేల చూపులు చూశాయి. ఆరంభంలో సూచీలు లాభాల్లో ఉన్నప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత తిరిగి ఒత్తిడికి గురైయ్యాయి. దీంతో తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 120 పాయింట్లు కోల్పోయి 61,044కు పడిపోయింది. ముఖ్యంగా ఐటీసీ, టెక్నలాజీ, లోహ షేర్లు అధిక ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో గరిష్టాల నుంచి సెన్సెక్స్ 869 పాయింట్లు కోల్పోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 63 పాయింట్లు తగ్గి 18,115 వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు అధికంగా లాభపడగా.. ఐటీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.