Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: అత్యంత ఉత్సాహకరమైన క్యాస్టింగ్ క్రూలో బాలీవుడ్‌కు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన జోడి (హమ్ తుమ్, తర రం పం) సైఫ్ అలి ఖాన్ మరియు రాణి ముఖర్జీ జోడి యశ్ రాజ్ ఫిలింస్ బంటీ ఔర్ బబ్లి-2లో మరో సారి జంటగా పూర్తిగా రీబూట్ అయి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సైఫ్ ఈ హాస్య చిత్రంలో రాకేశ్ ఉరుఫ్ బంటి పాత్ర పోషించారు. వారు సినిమాలో అత్యంత చిన్న పట్టణం ఫస్రత్గంజ్లో రైల్వే టికెట్ కలెక్టర్ పాత్ర పోషించేందుకు పలు కిలోల బరువును పెంచుకున్నారు.
బంటి మోసం చేసే పనిని మానుకుంటాడు. రాణి పాత్ర పోషించిన బబ్లి ఉరుఫ్ విమ్మితో కలిసి కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తన భార్యతో ప్రేమగా ఉంటూ, ఆమెను ప్రశంసిస్తూ ఉన్నప్పటికీ రాకేశ్ చాలా బోరింగ్‌ను అనుభవిస్తుంటాడు. చిన్న నగరంలో నిదానంగా కొనసాగే జీవనశైలి అతని ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపిస్తుంది. అతను థ్రిల్ కావాలని కోరుకుంటూ ఉంటాడు. భారతదేశం వ్యాప్తంగా అసాధారణ మోసగాళ్లను చూసినప్పుడు మరింత ఉద్వేగానికి గురవుతూ ఉంటాడు. అతని అతను తన జీవితంలో పలు అంశాలకు కట్టుబడి నిర్బంధితుడై ఉంటాడు.
దీని గురించి సైఫ్ మాట్లాడుతూ, ‘‘కుఖ్యాత మోసగాడు బంటిగా ఉన్నప్పుడు రాకేశ్ థ్రిల్ లేకుండా ఒక్క రోజూ గడిపేవాడు కాదు. అతడు తన వివరాలను రహస్యంగా ఉంచుతాడు. విమ్మితో వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు అతనికి తన సాహసం తప్పిపోవడం, దేశంలో ప్రతి ఇంట్లో మాట్లాడుకునే మోసపు పనులు రూపొందించే అవకాశాలు ఆగిపోతాయి. అతను తాను ఎవరు, ఏం కావాలనేదాన్ని తెలియకుండానే సత్యాన్ని అణచిపెట్టుకుని ఉండడంతో అతని ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది’’ అని వివరించారు.
‘‘నేను పలు కిలోల బరువు పెంచుకోవలసి వచ్చింది. అనంతరం నా ఇతర సినిమాల షూటింగ్‌ల కారణంతో వేగంగా బరువు తగ్గించుకోవలసి వచ్చింది. నేను ఇప్పుడు ఒకసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, రాకేశ్ ఉరుఫ్ ఓజీ బంటి నమ్మలేని విధంగా కనిపిస్తాడని అనిపించడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అతను ప్రజలను మోసం చేయడాన్ని విడిచి, తన కుటుంబంలో సభ్యత్వంతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అతని కష్టాలు సహజసిద్ధమైనవి. అతను మహోన్నత వ్యక్తి మరియు అతను అజ్ఞాతంలో ఉన్నట్లు వ్యవహరిస్తుంటాడు. అతను తాను అందరికీ తెలియాలన్నట్లు, తన వంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అతని జీవితం ఎలా రూపొందింది అంటే, అది అతన్ని నిరుత్సాహపరుస్తుంది. అతను తనను అందరూ ప్రముఖుడని భావించాలని కోరుకుంటాడు’’ అని వివరించారు.
బంటి ఔర్ బబ్లి-2 సంపూర్ణ కుటుంబ మనోరంజన చలనచిత్రం కాగా, సైఫ్ అలి ఖాన్, రాణి ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, అత్యంత ప్రతిభావంత నవ నట శర్వారి ఇందులో నటించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 19, 2021న విడుదల కనుంది. బంటి ఔర్ బబ్లి-2కు వరుణ్ వి.శర్మ దర్శకత్వం వహించగా (వైఆర్ఎఫ్ వారి బ్లాక్ బస్టర్లయిన సుల్తాన్, టైగర్ జిందా హైలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు), కొత్త స్టార్ జంట సిద్ధాంత్ చతుర్వేది మరియు సుందర నటి శర్వారి కొత్తగా మోసం చేసే జంట బంటి ఔర్ బబ్లిగా పరిచయం అవుతున్నారు.