Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ పిసి తయారీదారు బ్రాండ్ గిగాబైట్ టెక్నాలజీ ఇండియా సహకారంతో శ్వేత కంప్యూటర్స్ హైదరాబాద్‌లో తొలి గేమింగ్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పార్కలేన్లోని ఈ స్టోర్‌ను శనివారం లాంచనంగా ప్రారంభించారు. ఇక్కడ గిగాబైట్, ఆరస్కు సంబంధించిన మదర్‌బోర్డులు, గ్రాపిక్కార్డులు, ఎస్ఎస్డిఎస్, రామ్స్, కూలర్లు, క్యాబినెట్లు, పవర్ సప్లై, పెరిఫెరల్స్ తదితర ఉత్పత్తులు లభ్యమవుతాయని శ్వేత కంప్యూటర్స్ నిర్వాహకులు తెలిపారు. ''ఇది కొత్త తరం స్టోర్. పూర్తిగా పిసి బిల్డింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇక్కడ గేమర్స్ కాంపోనెంట్లను ఎంచుకోవచ్చు. మేము వినియోగదారులు, గేమర్లకు వారి కావాల్సిన ప్రకారం పిసిని అనుకూలీకరించడానికి, నిర్మించడానికి పూర్తి పరిష్కారాన్ని అందిస్తాము'' అని గిగాబైట్ ఇండియా డైరెక్టర్ సునీల్ గ్రేవాల్ తెలిపారు.