Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన నికర వడ్డీ ఆదాయం
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగంలోని ఐసిఐసిఐ బ్యాంక్ 2021 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ (క్యూ2) త్రైమాసికంలో 30 శాతం వృద్థితో రూ.5,511 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. నికర వడ్డీపై ఆదాయం, ఇతర ఆదాయం పెరుగడంతో బ్యాంక్ లాభాలు పెరిగాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,251 కోట్ల లాభాలు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు నికర వడ్డీపై ఆదాయం (ఎన్ఐఐ) 25 శాతం పెరిగి రూ.11,690 కోట్లుగా చోటు చేసుకుంది. 2020-21 ఇదే త్రైమాసికంలో రూ.9,366 కోట్ల ఎన్ఐఐ నమోదయ్యింది. ఇదే సమయంలో మొండి బాకీల కోసం రూ.2,995 కోట్ల కేటాయింపులు చేయగా.. గడిచిన క్యూ2లో 9 శాతం తగ్గి రూ.2,714 కోట్ల కేటాయింపులు చేసింది. 2021 సెప్టెంబర్ 30 నాటికి ఐసిఐసిఐ బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు 12 శాతం తగ్గి రూ.8,161 కోట్లుగా ఉన్నాయి. జూన్ 30 నాటికి ఈ ఎన్‌పిఎలు రూ.9,306 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో నికర ఎన్‌పిఎలు 1.16 శాతంగా ఉండగా.. సెప్టెంబర్ ముగింపు నాటికి 0.99 శాతానికి తగ్గాయి. ఏడాదికేడాదితో పోల్చితే 2021 సెప్టెంబర్ నాటికి బ్యాంక్ డిపాజిట్లు 17 శాతం పెరిగి రూ.9.7 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంక్ శాఖలు 5,277కు, ఎటిఎం కేంద్రాలు 14,045గా ఉన్నాయి.
ఐసిఐసిఐ బ్యాంక్ ప్రస్తుత సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భక్షీని కొనసాగించడానికి బ్యాంకింగ్ రెగ్యూలేటర్ ఆర్బిఐ ఆమోదం తెలిపింది. దీంతో 2021 అక్టోబర్ 15 నుంచి 2023 అక్టోబర్ 3వరకు ఆయన ఈ హోదాలో కొనసాగనున్నారు. శుక్రవారం సెషన్లో ఈ సూచీ 0.3 శాతం పెరిగి రూ.759.10 వద్ద ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ సూచీ 30 శాతం లాభపడింది. మార్కెట్ కాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు చేరింది.