Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్
ముంబయి : వరుసగా నాలుగు రోజులు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం ఉపశమనం లభించింది. తొలుత ఒడిదుడికులను ఎదుర్కొన్న ఆ తర్వాత లాభాల్లోకి మళ్లాయి. కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతు, బ్యాంకింగ్ పేర్ల మద్దతుతో తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 145.43 పాయింట్లు లేదా 60,967కు చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 10.50 పాయింట్లు రాణించి 18125 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో ఐసీఐసీఐ బ్యాంక్ అత్యధికంగా 11.6 శాతం పెరిగింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్ఎం, హెచ్యుఎల్ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, మారుతీ, హెచ్సిఎల్ టెక్, నెస్లే ఇండియా, ఐటీసీ షేర్లు నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. ఒక్క బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు మినహా అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈలో 1,047 స్టాక్స్ లాభపడగా.. 2,312 స్టాక్స్ నష్టాలు చవి చూశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.5 శాతం మేర విలువ కోల్పోయాయి.